amp pages | Sakshi

‘రంగు’లో హీరోలు విలన్‌లు ఉండరు

Published on Mon, 11/19/2018 - 19:16

న‌ల్ల‌స్వామి స‌మ‌ర్ప‌ణ‌లో యు అండ్ ఐ ఎంట‌ర్‌టైన్మెంట్స్ ప‌తాకంపై  త‌నీశ్‌, ప‌రుచూరి ర‌వి, ప్రియా సింగ్‌, ప‌రుచూరి వెంకటేశ్వ‌ర‌రావు, ష‌ఫీ, పోసాని కృష్ణ‌ముర‌ళి ప్ర‌ధాన తారాగ‌ణంగా రూపొందుతోన్న చిత్రం `రంగు`. కార్తికేయ‌.వి ద‌ర్శ‌క‌త్వంలో ఎ.ప‌ద్మ‌నాభ‌రెడ్డి, న‌ల్ల అయ్య‌న్న నాయుడు నిర్మాత‌లు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైద‌రాబాద్‌లో జ‌రిగింది. బిగ్ బాస్ సీజన్ 2  పాల్గొన్న సభ్యులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.  ఈ సందర్భంగా అతిథులు, చిత్ర బృందం మాట్లాడుతూ...

‘టైటిల్ నాకు బాగా నచ్చింది. సినిమా పాటలు, ట్రైలర్స్ చూస్తుంటే చాలా ఇంప్రెసివ్ గా ఉన్నాయి. తనీష్ నటన ఎంటో మనం చిన్నతనం నుండి చూస్తున్నాం. అతనికి ఈ సినిమా మంచి బ్రేక్ ఇస్తుందని నమ్ముతున్నాను’ అని రాజ్‌ కందుకూరి పేర్కొన్నారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి మాట్లాడుతూ..‘ చిన్న కథలకు ఆదరణ పెరుగుతుంది.  కథ బాగుంటే సినిమాలు ప్రజాదరణ పొందుతున్నాయి. కథ లేని సినిమాలను ఎన్ని హంగులున్నా ప్రేక్షకులు తిప్పి కొడుతున్నారు. రంగు చాలా ఆరోగ్య కరమైన సినిమా.

గాయం లో ‘నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జగాన్ని’అనే పాట రాసాను. అది నాకు చాలా తృప్తినిచ్చింది. చాలాకాలం తర్వాత ‘ఎక్కడ ఉంది ఈ చిక్కుముడి’ అంటూ రంగులో ఒక పాట రాయడం జరిగింది. అప్పటికీ ఇప్పటికీ సమాజంలో ఏ మార్పులేదు. మా అబ్బాయికి మంచి పేరు వచ్చినందుకు సంతోషంగా ఉంది.  పరుచూరి బ్రదర్స్  కథతో ప్రయాణం చేశారు. ‘రంగు’ లో కనిపించే క్రోథం ఎక్కడికి తీసుకెళ్తుంది ఎక్కడ ముంచుతుంది అనేది కథ, లారా పాత్రలో  తనీష్ నటన ఒక రిఫరెన్స్‌లా మిగలుతుంది. ఈ సినిమాతో స్టార్స్ అయినా నేల మీద నక్షత్రాలుగా ఉండాలని కోరుకుంటున్నాను’ అన్నారు.

దిగ్గజాలతో కలసి పనిచేసినందుకు గర్వంగా ఉంది..
హీరో త‌నీశ్ మాట్లాడుతూ..`నేను ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 20 ఏళ్లు అయ్యింది. నా తొలి సినిమా హిట్ అయిన రోజు నాకు చాలా ఆనంద‌మేసింది. చాలా ఏళ్ల త‌ర్వాత ఇంత ఆనందంగా ఉంది. ఈ సినిమాలో సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి, ప‌రుచూరి వెంక‌టేశ్వ‌ర‌రావు వంటి దిగ్గ‌జాల‌తో క‌లిసి ప‌నిచేశాను. చాలా రోజుల త‌ర్వాత మా అమ్మ నా కోసం ఈ ఫంక్ష‌న్‌కు వ‌చ్చారు. నా ఎక్స్‌డెంటెడ్ ఫ్యామిలీతో జ‌రుపుకుంటున్న తొలి ఫంక్ష‌న్. ఈ మూడు కార‌ణాల‌తో నేను చాలా ఆనందంగా ఉన్నాను. కార్తికేయ‌గారు సినిమాను నాతో చేసినందుకు ఆయ‌న‌కు థాంక్స్‌.  ఇందులో హీరోలు, విల‌న్స్ లేరు.. అన్ని పాత్ర‌లే. ప్ర‌తి పాత్ర ఎలా ఉండాలి.. ఎలా ఉండ‌కూడ‌ద‌నే విష‌యాల‌ను నేర్పిస్తుంది. ఈ నెల 23న సినిమా విడుద‌ల‌వుతుంది` అన్నారు. ఈ చిత్రానికి సంగీతం:  యోగీశ్వ‌ర శ‌ర్మ‌, సినిమాటోగ్రాఫ‌ర్‌:  టి.సురేంద‌ర్ రెడ్డి.
 

Videos

పిఠాపురం పవన్ కళ్యాణ్ గెలుపుపై చిరంజీవి వీడియో..కొమ్మినేని స్ట్రాంగ్ రియాక్షన్

ఏపీ రాజధానిపై ఈనాడు తప్పుడు ప్రచారం ... కొమ్మినేని అదిరిపోయే కౌంటర్..

అదిరిపోయే ప్లాన్ వేసిన విజయ్ దేవరకొండ..!

చంద్రబాబుపై బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి అదిరిపోయే సెటైర్లు..

రాక్షస పరివార్..

కూటమికి వైఎస్ జగన్ సూటి ప్రశ్నలు

కార్పొరేటర్లను కాంగ్రెస్ లోకి నేనే పంపించా..

టీడీపీ సర్పంచ్ కి 11 లక్షల సంక్షేమ పథకాలు...అది సీఎం జగన్ సంస్కారం..

విశాఖపై టీడీపీ కొత్తరాగం

పేదలపై చంద్రబాబు పెత్తందారీ కుట్ర

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?