amp pages | Sakshi

అమ్మాయికి నచ్చక్కర్లేదా?

Published on Sun, 03/04/2018 - 00:13

‘‘ఎవరూ ఎక్కువ కాదు.. ఎవరూ తక్కువ కాదు. ఆడ, మగ ఇద్దరూ సమానమే’’ అన్నారు రాశీ. సమానత్వం గురించి, ఇతర విశేషాలను ‘సాక్షి’తో ఇలా పంచుకున్నారు.

► సినిమా ఇండస్ట్రీ ‘మేల్‌ డామినేటెడ్‌’ అంటారు. చైల్డ్‌ ఆర్టిస్ట్‌ నుంచి హీరోయిన్‌గా మీది లాంగ్‌ కెరీర్‌. ఈ డామినేషన్‌  గురించి మీరేమంటారు?
ఈ పరిస్థితిలో ఎప్పుడు మార్పు వస్తుందా? అని ఎదురు చూస్తున్నా. నేను, తమిళ్, మలయాళ సినిమాలు కూడా చేశాను. మలయాళంలో అంతగా డామినేషన్‌ కనిపించదు. అక్కడ అందరూ ఈక్వల్‌ అన్నట్లుగానే వ్యవహరిస్తారు. మనతో పోల్చితే తమిళంలో డామినేషన్‌ తక్కువ. మనకు చాలా ఎక్కువ.

► ‘పెళ్లి చూపులు’ అప్పుడు ‘అమ్మాయి నచ్చిందా’ అని అబ్బాయిని అడుగుతారు. కొన్ని చోట్ల ‘అబ్బాయి నచ్చాడా’ అని అడగకుండానే సంబంధం ఖాయం చేసేస్తారు. అమ్మాయి అభిప్రాయం అవసరంలేదా?
ఎగ్జాక్ట్‌లీ. అది మాత్రం చాలా దయనీయమైన స్థితి. జీవితాంతం కలిసి బతకాల్సిన వ్యక్తిని సెలెక్ట్‌ చేసుకునే హక్కు అమ్మాయికి ఉండదా? అబ్బాయికి నచ్చితే చాలా? అమ్మాయికి నచ్చక్కర్లేదా? పుట్టినప్పటి నుంచి జాగ్రత్తగా పెంచి, అత్తింటికి పంపాల్సి వచ్చినప్పుడు మాత్రం అమ్మాయి నిర్ణయం గురించి పట్టించుకోకపోవడం దారుణం అనే చెప్పాలి. జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే హక్కు అబ్బాయికి ఉన్నప్పుడు అమ్మాయికి కూడా ఉండాలి. ఒకప్పటితో పోల్చితే ఇప్పుడు ఫర్వాలేదు. ఇంకా మారాలి.

► డిపెండెంట్‌ ఉమన్‌కి ఇండిపెండెంట్‌ ఉమన్‌కి తేడా ఏంటి?
నేను మిడిల్‌ క్లాస్, అప్పర్‌ మిడిల్‌ క్లాస్‌ గురించి మాట్లాడుతున్నా. నాకు ఊహ తెలిసినప్పుడు భర్త జాబ్‌ చేయాలి భార్య ఇంట్లో వంట చేయాలి, ఇంట్లో విషయాలు చూసుకోవాలి అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు పెరిగిన ధరల వల్ల కావచ్చు, ఇంట్లో ఏమీ తోచక.. ఇంకేదైనా రీజన్‌ వల్ల కావచ్చు ఆడవాళ్లు ఇండిపెండెంట్‌గా ఉండాలనుకుంటున్నారు. వాళ్లు చదువుకున్న చదువుకి తగ్గ జాబ్‌ లేదా ఏది చేయగలిగితే ఆ పని చేసి సంపాదించాలనుకుంటున్నారు. అది మంచి పరిణామం. నాకు తెలిసినంత వరకు ఉమన్‌ ఇండిపెండెంట్‌గానే ఉండాలి. ఉండటమే మంచిది. డిపెండెన్సీలో ఓ ఇన్‌సెక్యూర్టీ ఉంటుంది. ఏది చేయాలన్నా ఇతరుల మీద ఆధారపడాల్సిందే. సొంతంగా నిర్ణయాలు తీసుకునే ధైర్యం చేయలేరు. ఇండిపెండెంట్‌ ఉమన్‌లో కాన్ఫిడెన్స్‌ ఉంటుంది. ఇండిపెండెంట్‌గా ఉంటూనే ఫ్యామిలీ మెంబర్స్‌ మీద డిపెండ్‌ అవ్వడం తప్పు కాదు.

► రెమ్యునరేషన్‌ హీరోలకు ఎక్కువ.. హీరోయిన్లకు తక్కువ. దీని గురించి ఏమంటారు?
ఒకప్పటితో పోల్చితే ఇప్పుడు కొంచెం బెటర్‌. నేను హీరోయిన్‌ గా చేసినప్పుడు హీరోకి ఓ 70 లక్షలు ఇచ్చారనుకోండి.. మాకు 8 నుంచి 10 లక్షలు ఇచ్చేవారు. అంత డిఫరెన్స్‌ ఉండేది. ఇప్పుడు హీరోకి 3 కోట్లు ఇస్తే హీరోయిన్‌కి కూడా దగ్గర దగ్గర కోటి రూపాయలు ఇస్తున్నారు. ఆ మార్పు వచ్చినందుకు హ్యాపీ. అయితే ఎప్పుడూ హీరోకే ఇంపార్టె    ఉంటుంది. ఎందుకంటే సినిమా బిజినెస్‌ జరిగేదే హీరో మార్కెట్‌ని బేస్‌ చేసుకుని అంటారు కదా. అలాగని హీరోయిన్‌ లేని సినిమా ఉంటుందా? నెవర్‌. హీరో లేని సినిమాలు వస్తున్నాయి కదా. అందుకే హీరోయిన్‌ ఓరియంటెడ్‌ సినిమాలు బాగా ఆడాలని కోరుకుంటాను.

► కొందరు హీరోయిన్లు ‘ఫైనాన్షియల్‌ మేటర్స్‌’ని మీలా అమ్మకో, నాన్నకో, అన్నయ్యకో అప్పజెప్పేస్తారు. ఎందుకలా? ‘ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌’ చేత కాకపోవడం వల్లనా?
చేత కాదని కాదు. నేను చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా వచ్చి, ఆ తర్వాత హీరోయిన్‌ అయ్యాను. చిన్నప్పుడు అమ్మానాన్న చూసుకున్నారు. పెద్దయ్యాక అదే కంటిన్యూ అయింది. నేను ఏ సినిమాలు చేయాలి? ఎంత బాగా యాక్ట్‌ చేయాలి? అనే విషయాల మీదే దృష్టి పెట్టేదాన్ని. నేనంటే చిన్నప్పుడే ఇండస్ట్రీకి వచ్చేశాను కాబట్టి నేను ‘డిపెండ్‌’ అయ్యాను. ఇప్పుడు కొందరు హీరోయిన్లు ‘ఇండిపెండెంట్‌’గా ఉంటున్నారు. అది మంచిదే. మా జనరేషన్‌ హీరోయిన్స్‌ కంటే ఇప్పుడు హీరోయిన్స్‌ చాలా బెస్ట్‌. మాలా 14, 15 ఇయర్స్, 20 ఇయర్స్‌ లోపు రావటం లేదు. చాలా బ్రాడ్‌ మైండెడ్‌గా ఉంటున్నారు. మాలాగా రైట్‌ సైడ్‌లో అమ్మ, లెఫ్ట్‌ సైడ్‌లో నాన్న ఉండాలనుకోవడంలేదు. వాళ్లంతట వాళ్లే షూటింగ్స్‌కు వెళ్లిపోతున్నారు. కేవలం స్టాఫ్‌ ఉంటే చాలు. మొత్తం వాళ్లే మేనేజ్‌ చేసుకుంటున్నారు. ఎవరి మీదా ఆధారపడటంలేదు. అలానే ఉండాలి. ఎలా ఇన్వెస్ట్‌ చేస్తే బాగుంటుందో తెలుసుకుంటున్నారు. ‘సేఫ్‌’గా లైఫ్‌ని ప్లాన్‌ చేసుకుంటున్నారు. హీరోయిన్లనే కాదు.. ఆడవాళ్లందరూ చాలా తెలివిగా ఉండాలి. మనకెందుకులే? మగవాళ్లు చూసుకుంటారు అనుకోకూడదు. ‘ఆధారపడటం’ అంటే మన లైఫ్‌ని వేరేవాళ్ల చేతిలో పెట్టేసినట్లే. ఉన్న ఒక్క లైఫ్‌ మన చేతుల్లో లేకపోతే ఎలా?

► ‘నీకేం తెలుసులే’ అని భార్యను భర్త అనడం చాలా ఇళ్లల్లో చూస్తుంటాం. ఇంట్లో ‘డెసిషన్‌  మేకింగ్‌’ ఎవరిదైతే బాగుంటుంది?
ఆడవాళ్లదైతేనే బాగుంటుంది. ఎందుకంటే పుట్టినింటి బంధువులను, మెట్టినింటి బంధువులను కలిపి ఉంచగలిగేది ఆడవాళ్లే. ఇంటి మేనేజ్‌మెంట్‌ ఆడవాళ్ల చేతుల్లోనే ఉండాలి. మా ఇంటికి సంబంధించినంతవరకూ చాలావరకు నా నిర్ణయాలే. అయినా డెసిషన్‌  అనేది ‘విషయం’ మీద ఆధారపడి ఉంటుంది. ఆ విషయం మీద భర్తకు పట్టు ఉంటే తనే డెసిషన్‌  తీసుకోవాలి. ఒకవేళ భార్యకు ఉంటే ఆమెకే వదిలేయాలి. అంతేకానీ నేను మగాణ్ణి.. నేనే డెసిషన్‌  తీసుకోవాలి. నేననుకున్నదే జరగాలనుకోకూడదు. ఎందుకంటే ‘రాంగ్‌ డెసిషన్‌ ’ ఇంటిని ఛిన్నాభిన్నం చేస్తుంది. ఇద్దరూ ఓ అండర్‌స్టాండింగ్‌కి వచ్చి, ‘ఇదిగో ఈ విషయంలో నువ్వైతే బెటర్‌. నువ్వు ఏ డెసిషన్‌  తీసుకున్నా ఫర్వాలేదు’ అని మాట్లాడుకుంటే ప్రాబ్లమ్స్‌ ఉండవు.

► భార్య కన్నా భర్త ఎక్కువ సంపాదిస్తే భర్తకు డైజెస్ట్‌ కాదు. సొసైటీ ఆ భర్తకు పెద్దగా విలువ ఇవ్వదు. ఏం.. భార్య ఎక్కువ సంపాదించకూడదా?
సొసైటీ దాకా ఎందుకు? భార్యాభర్త.. ఇద్దరూ సంపాదిస్తున్న ఒక ఇంటిని తీసుకుందాం. భార్యకు భర్త కంటే ఎక్కువ ఇన్‌కమ్‌ ఉంటే..  ఇంట్లో పని చేసేవాళ్లు కూడా ‘మేడమ్‌ మేడమ్‌’ అని భార్యకే ఎక్కువ విలువ ఇస్తారు. భార్య ఆ విషయాన్ని మామూలుగా తీసుకుంటే ఓకే... తన గురించి తాను ఎక్కువ అనుకుని, భర్తను డామినేట్‌ చేయడానికి ప్రయత్నిస్తే అప్పుడు ప్రాబ్లమ్స్‌ మొదలవుతాయి. ఆటోమేటిక్‌గా పిల్లలకు, రిలేటివ్స్‌కు కూడా ఆ భర్త చులకన అయిపోతాడు. అలా కాకుండా ‘మన కుటుంబం కోసం సంపాదిస్తున్నాం’ అనే ఫీలింగ్‌తో భార్య ఉండాలి. బాగా సంపాదించే భర్త కూడా అలానే అనుకోవాలి. అప్పుడా సంసారం బాగుంటుంది. ఆడవాళ్లు ఎక్కువ సంపాదిస్తే తప్పేం కాదు. ఇద్దరూ సమానం అనుకోగలిగితే ఎటువంటి సమస్యలూ రావు.               
– డి.జి. భవాని

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)