amp pages | Sakshi

లబ్‌ డబ్‌ కాదు... ధడక్‌!

Published on Sun, 11/12/2017 - 00:28

అవును. శ్రీదేవి తనయ జాన్వీ కపూర్‌ని చూస్తే కుర్రకారు గుండె వేగంగా కొట్టుకోవడం ఖాయం. ఆ జనరేషన్‌లో శ్రీదేవి గొప్ప అందగత్తె అయితే ఈ తరంలో ఆమె కుమార్తె జాన్వీ కూడా గొప్ప అందగత్తెల లిస్టులో ఉంటుంది. అందుకే జాన్వీని పరిచయం చేస్తూ, నిర్మించనున్న చిత్రానికి ‘ధడక్‌’ అని టైటిల్‌ పెట్టాలని నిర్మాత కరణ్‌ జోహార్‌ అనుకున్నారేమో. ధడక్‌ అంటే హార్ట్‌ బీట్‌ అని అర్థం. మరాఠీ బ్లాక్‌బస్టర్‌ మూవీ ‘సైరాట్‌’కి ఇది రీమేక్‌. ఈ సినిమా గురించి ప్లాన్‌ జరిగి చానాళ్లయింది. కానీ, ఇంకా పట్టాలెక్కలేదు. దాంతో ‘సైరాట్‌’ రీమేక్‌ లేనట్లే అనే వార్తలు మొదలయ్యాయి.

ఈ నేపథ్యంలో డిసెంబర్‌లో సినిమాని స్టార్ట్‌ చేయడానికి సన్నాహాలు మొదలయ్యాయని, ‘ధడక్‌’ టైటిల్‌ కన్ఫర్మ్‌ చేశారనే వార్త వచ్చింది. ‘బద్రినాథ్‌ కీ దుల్హనియా’ ఫేమ్‌ శశాంక్‌ ఖైతాన్‌ దర్శకత్వంలో ఈ  చిత్రం రూపొందనుంది. ‘సైరాట్‌’ మహారాష్ట్ర నేపథ్యంలో ఉంటుంది. హిందీ రీమేక్‌ని మాత్రం హర్యానా బ్యాక్‌డ్రాప్‌లో తీయనున్నారు. అన్నట్లు.. ఈ చిత్రంలో హీరో ఎవరో తెలుసా? ప్రముఖ హీరో షాహిద్‌ కపూర్‌ తమ్ముడు ఇషాన్‌ కట్టర్‌. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదలవుతుంది. ఇప్పటికే జాన్వీ పలు కార్యక్రమాల్లో చిట్టి పొట్టి దుస్తుల్లో దర్శనమిచ్చి, కుర్రాళ్ల మతులు పోగొట్టారు. ఇక.. సిల్వర్‌ స్క్రీన్‌పై ఈ అందాల రాశిని చూశాక.. వాళ్ల గుండె లబ్‌ డబ్‌కి బదులు ధడక్‌ ధడక్‌... అని కొట్టుకుంటుందేమో!

Videos

అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు

మంగళగిరిలో లోకేష్ ప్రచారానికి కనిపించని జనాదరణ

భూములపై ప్రజలను భయపెట్టే కుట్ర..అడ్డంగా బుక్కైన అబ్బా కొడుకులు

అభివృద్ధికి కేరాఫ్ బుగ్గన...

వాడి వేడి ప్రసంగాలు..హోరెత్తిన జన నినాదం..

ప్రచార జోరు: వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులకు ప్రజల నుంచి అపూర్వ స్పందన

సీఐడీ నోటీసులు..దుష్ప్రచారాలపై విచారణ షురూ..

ఈరోజు సీఎం జగన్ షెడ్యూల్

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌