amp pages | Sakshi

రజనీకాంత్‌కు కమల్‌ మద్దతు!

Published on Wed, 06/06/2018 - 16:46

చెన్నై : దక్షిణాది సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కు చిత్రవర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. రజనీతో రాజకీయంగా, పలు అంశాల్లో విభేదిస్తున్నప్పటికీ సినిమాల పరంగా తాము ఎప్పటికీ ఒక్కతాటిపైనే నిలుస్తామని నిరూపించారు కమల్‌ హాసన్‌. కాలా మూవీ విడుదల వివాదం నేపథ్యంలో కమల్‌ మీడియాతో మాట్లాడారు. ఈ విషయంలో రజనీకి తన మద్దతు ఉంటుందన్నారు. తన విశ్వరూపం సినిమాను కూడా కర్ణాకటలో నిషేధించిన విషయాన్ని కమల్‌ గుర్తుచేశారు.

కర్ణాటక ఫిల్మ్‌ ఛాంబర్‌ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని సమస్యను తీర్చేందుకు కృషి చేయాలన్నారు. రజనీ తాజా చిత్రం కాలాను చూసేందుకు ఎంతో మంది అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని కమల్‌ పేర్కొన్నారు. రైతుల సమస్యల తరహాలోనే ప్రతి సమస్య, వివాదాన్ని సంబంధిత బోర్డు, శాఖగానీ చర్చించి సమసిపోయేలా చేయాలని సూచించారు. 

కాగా, కాలా మూవీ విడుదలకు సహకరించాలని కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామికి రజనీకాంత్‌ విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. థియేటర్ల వద్ద భద్రతా కల్పించాలని కన్నడ భాషలో ఓ సందేశాన్ని కుమారస్వామికి పంపారు. మూవీ విడుదలను అడ్డుకోలేమని హైకోర్టు తీర్పునిచ్చినా.. ప్రస్తుతం వివాదాలు తలెత్తుతాయని కొన్ని రోజులు వేచి చూడాలని కుమారస్వామి సూచిస్తున్నారు. ఓవైపు నాడార్‌ సంఘం మూవీపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కాలాలో తమ వర్గానికి చెందిన వ్యక్తిని కించపరిచేలా సీన్లున్నాయని, అందుకు మూవీ విడుదలను అడ్డుకుంటామని నాడార్‌ వర్గం హెచ్చరిస్తోంది.

Videos

ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్

పొరపాటున బాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపే..!

జగనన్న రాకతో దద్దరిల్లిన గాజువాక సభ

గాజువాకలో జనజాతర

బీజేపీ, టీడీపీ, జనసేన తోడు దొంగలు..!

విశాఖ నుంచే ప్రమాణస్వీకారం చేస్తా

వీళ్లే మన అభ్యర్థులు.. ఈసారి ఢిల్లీ పీఠం కదలాలి

ఇచ్ఛాపురం బహిరంగ సభలో సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్

చంద్రబాబు చేసిన మోసాలు లైవ్ లో వినిపించిన సీఎం జగన్

బాబును చీల్చి చెండాడిన మహిళలు

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?