నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
లాయర్ మంజిమా
Published on Sun, 07/21/2019 - 06:19
ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్స్‌ను తెలుసుకునే పనిలో బిజీగా ఉన్నారు కథానాయిక మంజిమా మోహన్. కోర్టులో లాయర్‌గా వాదించనున్నారు. ‘ఎఫ్.ఐ.ఆర్’ (ఫైజల్ ఇబ్రహీమ్ రైజ్) అనే సినిమాలో ఆమె లాయర్‌గా కనిపించనున్నారు. మను ఆనంద్ దర్శకత్వంలో విష్ణు విశాల్ హీరోగా ఈ తమిళ చిత్రం తెరకెక్కుతోంది. ఇటీవల ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. అనుకోని పరిస్థితుల కారణంగా పోలీసుల చేతిలో చిక్కిన ఓ ముస్లిం యువకుడి నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. జూనియర్ అడ్వకేట్‌గా మంజిమా నటిస్తున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే.. తెలుగులో నాగచైతన్య నటించిన ‘సాహసం శ్వాసగా సాగిపో’ చిత్రంలో మంజిమా మోహన్ కథానాయికగా నటించిన విషయం గుర్తుండే ఉంటుంది.
#
Tags