వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
ఆమెది ఇప్పటికీ చెక్కుచెదరని అందం: నాగ్
Published on Tue, 03/10/2015 - 15:44
నాగార్జున.. రమ్యకృష్ణ ఈ కాంబినేషన్ అంటే చాలు, బోలెడన్ని అలనాటి హిట్ సినిమాలు గుర్తుకొస్తాయి. సంకీర్తన, ఇద్దరూ ఇద్దరే, క్రిమినల్, ఘరానా బుల్లోడు, హలో బ్రదర్, అన్నమయ్య.. ఇలాంటి అనేక సినిమాల్లో వీరిద్దరి జంట అప్పట్లో హల్చల్ చేసింది. అలాంటి రమ్యకృష్ణతో నాగార్జున మళ్లీ ఇన్నాళ్లకు మరో సినిమా చేస్తున్నారు. 15 ఏళ్లు దాటినా ఆమె అందం ఇప్పటికీ చెక్కుచెదరలేదని ప్రశంసల వర్షం కురిపించాడు.
వీళ్లిద్దరు కలిసి నటిస్తున్న 'సోగ్గాడే చిన్ని నాయనా' సినిమా షూటింగ్ ప్రస్తుతం మైసూరులో వేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో నాగార్జున డబుల్ రోల్ పోషిస్తున్నారు. తాత, మనవళ్లుగా నాగార్జునే నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఫొటోలను, విశేషాలను నాగార్జున తన ట్విట్టర్ పేజీలో షేర్ చేసుకున్నారు. 1500 ఏళ్ల క్రితం నాటి వైష్ణవాలయంలో షూటింగ్ జరుగుతోందని నాగ్ తెలిపారు.
#scn shooting in a vishnu temple1500 years old with dear ramyakrishna after 15 years/as gorgeous as ever:)👍 pic.twitter.com/sokQ30wgLh
— Nagarjuna Akkineni (@iamnagarjuna) March 10, 2015
Tags