amp pages | Sakshi

'నరుడా డోనరుడా' మూవీ రివ్యూ

Published on Fri, 11/04/2016 - 11:53

టైటిల్ : నరుడా డోనరుడా
జానర్ : రొమాంటిక్ కామెడీ
తారాగణం : సుమంత్, తనికెళ్ల భరణి, పల్లవి సుభాష్, శ్రీ లక్ష్మీ
సంగీతం : శ్రీ చరణ్
దర్శకత్వం : మల్లిక్ రామ్
నిర్మాత : వై.సుప్రియ, జాన్ సుధీర్ పూదోట,

స్టార్ వారసుడిగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చినా.. ఆ స్థాయికి తగ్గ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకోలేకపోయిన యంగ్ హీరో సుమంత్. దీంతో లాంగ్ గ్యాప్ తీసుకున్న సుమంత్ ఓ బోల్డ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యాడు. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన విక్కీ డోనర్ సినిమాను తెలుగులో నరుడా డోనరుడా పేరుతో రీమేక్ చేశాడు. 100% స్ట్రయిక్ రేట్ అన్న ట్యాగ్ లైన్తో వస్తున్న ఈ స్పెర్మ్ డోనర్ సక్సెస్ సాధించాడా..?


కథ :
డాక్టర్ ఆంజనేయులు (తనికెళ్ల భరణి).. ఓల్డ్ సిటీలో ఓ చిన్న ఇన్పర్టిలిటీ క్లినిక్ నడుపుతుంటాడు. తన దగ్గరకు వచ్చే క్లయింట్స్కు సంతాన భాగ్యం కలిగించేందుకు ఓ వీర్యదాత కోసం వెతుకుతుంటాడు. విక్రమ్  అలియాస్ విక్కీ (సుమంత్) డిగ్రీ పూర్తి చేసి ఎలాంటి పని పాట లేకుండా ఫ్రెండ్స్తో టైమ్ పాస్ చేస్తూ షాపింగ్లు పబ్లు అంటూ తిరుగుతుంటాడు. విక్కీ తండ్రి కార్గిల్ వార్లో మరణించటంతో తల్లి స్వీటి(శ్రీలక్ష్మీ) బ్యూటి పార్లర్ నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తుంటుంది. ఎప్పటికైనా కొడుకు మంచి ఉద్యోగం చేస్తూ లైఫ్లో సెటిల్ అవ్వాలని ఎదురుచూస్తుంటుంది.

డాక్టర్ ఆంజనేయులు, ఖాళీగా టైంపాస్ చేస్తున్న విక్కీ తనకు బాగా పనికొస్తాడని భావించి అతని వెంటపడతాడు. డబ్బులు ఎరచూపి వీర్యదానానికి ఒప్పిస్తాడు. అదే సమయంలో ఓ బ్యాంక్లో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేసే ఆషిమా రాయ్(పల్లవి సుభాష్) అనే బెంగాళీ అమ్మాయితో విక్కీకి పరిచయం అవుతోంది. ఆ పరిచయం ప్రేమగా మారి ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకుంటారు. ఆషిమా గతం గురించి తెలిసిన తరువాత కూడా విక్కీ పెళ్లికి అంగీకరించటంతో ఆషిమాకు విక్కీ మీద ప్రేమ మరింత పెరుగుతుంది.

పెళ్లి తరువాత మొదలవుతుంది అసలు సమస్య, అంత కాలం తాను ఏం బిజినెస్ చేస్తున్నాడో చెప్పకుండా మేనేజ్ చేసిన విక్కీ, ఫైనల్ గా ఓ రోజు తప్పనిసరి పరిస్థితుల్లో తాను వీర్యదానం చేస్తున్న విషయం ఆషిమాకు చెప్పేస్తాడు. దీంతో ఆషిమా, విక్కీ నుంచి దూరంగా వెళ్లిపోతుంది. అలా దూరమైన విక్కీ, ఆషిమాలు తిరిగి ఎలా ఒకటయ్యారు..? తన వల్లే విడిపోయినా ఆ దంపతులను డాక్టర్ ఆంజనేయులు ఎలా కలిపాడు..? అన్నదే మిగతా కథ.


నటీనటులు :
ఇలాంటి బోల్డ్ సినిమా చేయాలన్న నిర్ణయం తీసుకున్న హీరో సుమంత్ ప్రయత్నాన్ని ప్రశంసించకుండా ఉండలేం. దాదాపు రెండేళ్ల విరామం తరువాత తెర మీద కనిపించిన సుమంత్ మంచి నటనతో ఆకట్టుకున్నాడు. కామెడీ సీన్స్తో పాటు ఎమోషనల్ సీన్స్ లోనూ మెప్పించాడు. పల్లవి సుభాష్ హీరోయిన్గా పరవాలేదనిపించింది. తన పరిధి మేరకు డిసెంట్ లుక్స్తో, కంటతడి పెట్టించే సన్నివేశాలతో ఆకట్టుకుంది. ఇంకా సినిమా అంతా తానే అయి నడిపించాడు తనికెళ్ల భరణి, హీరోను వీర్యదాతగా మార్చే డాక్టర్ గా, అద్భుతమైన కామెడీ పండించాడు. ప్రతీ సీన్ లోనూ తన మార్క్ చూపిస్తూ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్గా నిలిచాడు. చాలా రోజుల తరువాత తెర మీద కనిపించిన సీనియర్ కమెడియన్ శ్రీలక్ష్మీ తల్లి పాత్రలో హుందాగా కనిపించింది.

సాంకేతిక నిపుణులు :
విక్కీ డోనర్ లాంటి బోల్డ్ సబ్జెక్ట్ను తెలుగు తెర మీద చూపించాలన్న నిర్ణయం సాహసం అనే చెప్పాలి. అలాంటి సాహసానికి రెడీ అయిన దర్శకుడు మల్లిక్ రామ్, అందుకు తగ్గ కథనాన్ని సిద్ధం చేసుకోలేకపోయాడు. ముఖ్యంగా కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాలో కామెడీ పెద్దగా పండకపోవటం మేజర్ మైనస్ పాయింట్గా చెప్పుకోవాలి. ఫస్ట్ హాఫ్ అంతా నవ్వించాలని చేసిన ప్రయత్నం విఫలమైంది. సెకండ్ హాఫ్లో అసలు కథలోకి ఎంటర్ అయిన తరువాత వచ్చిన ఎమోషనల్ సీన్స్ ఆకట్టుకుంటాయి. శ్రీ చరణ్ సంగీతం పరవాలేదు. ఎడిటింగ్, సినిమాటోగ్రఫి సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్ :
తనికెళ్ల భరణి నటన
ప్రీ క్లైమాక్స్ ఎమోషనల్ సీన్స్

మైనస్ పాయింట్స్ :
కామెడీ పెద్దగా వర్క్ అవుట్ కాకపోవటం
తెలుగు నెటివిటీకి సూట్ అవ్వని సబ్జెక్ట్

- సతీష్ రెడ్డి, ఇంటర్నెట్ డెస్క్

Videos

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @మచిలీపట్నం (కృష్ణా జిల్లా)

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

పొన్నూరు లో పవన్ సభ అట్టర్ ఫ్లాప్ అంబటి మురళీకృష్ణ సెటైర్లు

చంద్రబాబు, కొడుకు పప్పు తుప్పు.. అనిల్ కుమార్ యాదవ్ స్పీచ్ కి దద్దరిల్లిన మాచెర్ల

"వాళ్లకి ఓటమి భయం మొదలైంది అందుకే ఈ కొత్త డ్రామా.."

వెంకయ్య నాయుడు బామ్మరిది సంచలన కామెంట్స్

"30 లక్షల కోట్లు స్వాహా అందులో 14 లక్షల కోట్లు.." కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Watch Live: మాచర్లలో సీఎం జగన్ ప్రచార సభ

Photos

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)