amp pages | Sakshi

విజయశాంతి తరహాలో...

Published on Mon, 05/07/2018 - 09:25

సాక్షి, చెన్నై : దక్షిణాదిలో ఇప్పుడు సంచలన నటి నయనతార రేంజే వేరు. ఆమె చిత్రాలు స్టార్‌ హీరోల చిత్రాలకు దీటుగా వసూళ్లను కొల్లగొడుతున్నాయి. యువ నటుల నుంచి, ప్రముఖ నటుల వరకూ నయనతార స్టార్‌డమ్‌ను ఉపయోగించుకోవడానికి తహతహ లాడుతున్నారనడం అతిశయోక్తి కాదు. నయనతార ప్రస్తుతం చిరంజీవికి జంటగా సైరా నరసింహారెడ్డి చిత్రంలో నటిస్తున్నారు. వీటితో పాటు తను నటిస్తున్న హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ కథా చిత్రాలు కొన్ని నిర్మాణంలో ఉన్నాయి. మరికొన్ని విడుదలకు సిద్ధం అవుతున్నాయి. త్వరలో అజిత్‌తో విశ్వాసం చిత్రంలో జత కట్టడానికి రెడీ అవుతున్నారు. అదే విధంగా యువ క్రేజీ నటుడు శివకార్తికేయన్‌తో రెండోసారి నటించనున్నారు. రాజేశ్‌.ఎం ఈ చిత్రానికి దర్శకుడు.

చాలా కాలం క్రితం లేడీ సూపర్‌స్టార్‌గా రాణించిన నటి విజయశాంతి మన్నన్‌ చిత్రంలో రజనీకాంత్‌కు జంటగా నటించారు. పి.వాసు దర్శకత్వం వహించిన ఆ చిత్రంలో విజయశాంతి పాత్ర రజనీకాంత్‌ పాత్రకు దీటుగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం, అహంకారం కలగలిపిన ఆ పాత్రలో విజయశాంతి నటన ప్రశంసలు అందుకుంది.  ప్రస్తుతం నటి నయనతార కూడా లేడీసూపర్‌స్టార్‌ ఇమేజ్‌ను పొందారు. శివకార్తికేయన్‌కు జంటగా నటించనున్న చిత్రం వినోదానికి పెద్ద పీట వేసే కథ అయినా, నయనతార పాత్ర మాత్రం కోపం, పౌరుషం కలిగి చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందట. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు ఇటీవలే జరిగాయి. స్టూడియోగ్రీన్‌ పతాకంపై కేఈ.జ్ఞానవేల్‌ రాజా నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలోనే సెట్‌పైకి వెళ్లనుంది. 

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)