amp pages | Sakshi

చెప్పలేని చోట ఏర్పడే బాధలాంటిది..

Published on Mon, 01/27/2020 - 07:27

సినిమా: ప్రేమకు నిర్వచనం నటి నివేదాపేతురాజ్‌ ఏం చెప్పిందో తెలుసా? తమిళం పూర్వీకం కలిగిన ఈ చిన్నది చిన్న వయసులోనే తల్లిదండ్రులతో కలిసి దుబాయ్‌కి మకాం మార్చేసింది. అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేసిన నివేదాపేతురాజ్‌ నటి కాక ముందు మోడలింగ్‌ రంగాన్ని ఎంచుకుంది. అక్కడ పాపులర్‌ అయిన తరువాత నటిగా పిలుపు వచ్చింది. అలా తమిళంలో ఒరు నాళ్‌ కూత్తు చిత్రంతో కథానాయకిగా రంగప్రవేశం చేసింది. ఆ చిత్రం విజయంతో నటిగా స్థిరపడిపోయింది. 2016లో తెలుగు సినీరంగానికీ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఇప్పుడు దక్షిణాది నాయకిగా గుర్తింపు పొందింది. ముఖ్యంగా తమిళంలో టిక్‌ టిక్‌ టిక్, తిమిరుపుడిచ్చవన్‌ చిత్రాలతో పాపులర్‌ అయ్యింది.

ఇటీవల విజయ్‌సేతుపతితో జత కట్టిన సంఘతమిళన్‌ చిత్రం ఈ అమ్మడికి మంచి పేరునే తెచ్చి పెట్టింది. త్వరలో ప్రభుదేవాతో జత కట్టిన పొన్‌ మాణిక్యవేల్‌ చిత్రం తెరపైకి రానుంది. ప్రస్తుతం చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉంది. కాగా  ఇప్పటి వరకూ ఈ జాణకు పక్కింటి అమ్మాయి ఇమేజ్‌ ఉంది. దాని నుంచి బయటపడాలని నిర్ణయించుకుంది. ఇప్పుడు గ్లామర్‌ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేస్తూ వార్తల్లో నానుతోంది. అంతే కాదు ఈ మధ్య తరచూ ఫేస్‌బుక్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో అభిమానులతో ముచ్చటిస్తోంది. వారి ప్రశ్నలకు తనదైన స్టైల్‌లో బదులిస్తూ వారిని ఆనందపరుస్తోంది. అలా ఇటీవల ఒక అభిమాని ప్రేమ గురించి ఏమనుకుంటున్నారు అన్న ప్రశ్నకు చెప్పలేని చోట ఏర్పడే బాధలాంటిది ప్రేమ అని బదులిచ్చింది. నివేదాపేతురాజ్‌ ప్రేమ గురించి చెప్పిన నిర్వచనం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తోంది.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌