amp pages | Sakshi

డాన్సింగ్‌ కింగ్‌తో రొమాన్స్‌కు..

Published on Fri, 10/27/2017 - 05:03

తమిళసినిమా: నృత్యదర్శకుడిగా దుమ్మురేపిన ప్రభుదేవా ఆ తరువాత దర్శకుడిగా కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్‌ వరకూ సంచలనం సృష్టించారు. తాజాగా కథానాయకుడిగా యమ బీజీ అయిపోయారు. రెండు మూడు చిత్రాలు షూటింగ్‌లో మరో రెండు మూడు చిత్రాలు కమిట్‌మెంట్‌లో ఉన్నాయి. తాజాగా మరో చిత్రానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. చదరం 2 చిత్రం ఫేమ్‌ దర్శకుడు సుమంత్‌ రాధాకృష్ణన్‌ తాజా చిత్రంలో ప్రభుదేవా కథానాయకుడిగా నటించనున్నారు.

ఇందులో నివేదాపేతురాజ్‌ ఆయనతో రొమాన్స్‌ చేసే అవకాశాలున్నట్లు తాజా సమాచారం. తొలి చిత్రం ఒరునాళ్‌ కూత్తు చిత్రంలోనే మంచి పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ ఇటీవల నటించిన పొదువాగ ఎన్‌ మనసు తంగం చిత్రం పెద్దగా ప్రేక్షకాదరణను  పొందలేకపోయింది. దీంతో జయం రవితో జత కడుతున్న టిక్‌ టిక్‌ టిక్‌ చిత్రంపైన చాలా అశలు పెట్టుకుంది. శక్తి సౌందర్‌రాజన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం అంతరిక్షంలో జరిగే కథా చిత్రంగా తెరకెక్కుతోంది.

దర్శకుడు సుమంత్‌ రాధాకృష్ణన్‌ ఇటీవల నటి నివేదాపేతురాజ్‌ను కలిసి కథను వినిపించారట. కథ నచ్చడంతో పాటు ప్రభుదేవాతో నటించడానికి ఈ అమ్మడు చాలా ఆసక్తిని కనబరచిందట. ఈ విషయాన్ని దర్శకుడు సుమంత్‌ రాధాకృష్ణన్‌ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. త్వరలోనే ఆ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద డాన్సింగ్‌ కింగ్‌ ప్రభుదేవాతో రొమాన్స్‌ చేసే అవకాశాన్ని నివేదా పేతురాజ్‌ కొట్టేసిందన్నమాట.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌