amp pages | Sakshi

ఆ హీరోలకు నో చాన్స్ !

Published on Sat, 03/11/2017 - 02:28

ఆ హీరోలకు నో కాల్‌షీట్స్‌ అంటోంది నటి రకుల్‌ప్రీత్‌సింగ్‌. ప్రారంభ దశలో ఒక్క చాన్స్ ప్లీజ్‌ అంటూ ఫొటో ఆల్బమ్‌లు పట్టుకుని దర్శక నిర్మాతల కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగిన నటీమణులు లేకపోలేదు. అలాగే వర్థ్ధమాన హీరోలతో నటించి ఎదిగిన వారిని చూశాం. అలా ఒకటి రెండు విజయాలు వరించగానే ఆది కాలాన్ని మరచిపోవడం, స్టార్‌ హీరోలతో నటించే అవకాశం రాగానే చిన్న హీరోల సరసన నటించడానికి సుముఖత చూపని హీరోయిన్లను చూస్తున్నాం.

నటి రకుల్‌ప్రీత్‌సింగ్‌ ఇందుకు అతీతం కాదని నిరూపించుకుంటోంది. ఈ జాణ తొలిరోజుల్లో కోలీవుడ్‌లో ఆర్య తమ్ముడు సత్య, గౌతమ్‌కార్తీక్‌ లాంటి నవ హీరోలతో రొమాన్స్ చేసింది. ఆ చిత్రాలు ఆశించిన విజయాలను సాధించకపోవడం, అమ్మడిని కోలీవుడ్‌ పట్టించుకోకపోవడంతో టాలీవుడ్‌కు జంప్‌ చేసింది. అక్కడ ఆదిలో వర్థమాన హీరోలతోనే జత కట్టింది. లక్కీగా ఆ చిత్రాలు సక్సెస్‌ అవడంతో స్టార్‌ హీరోలు రామ్‌చరణ్, జూనియర్‌ ఎన్టీఆర్, మహేశ్‌బాబు లాంటివారితో నటించే అవకాశాలు వరించాయి.

దీంతో ఆటోమేటిక్‌గా స్టార్‌ హీరోయిన్ ఇమేజ్‌ను అందుకున్న రకుల్‌ప్రీత్‌సింగ్‌కు ఇప్పుడు కోలీవుడ్‌లోనూ ఎర్ర తివాజీ పరుస్తున్నారు. ఆ మధ్య విశాల్‌ సరసన నటించే అవకాశం వచ్చినా జార విడుచుకున్న ఈ భామకు తాజాగా కార్తీతో రొమాన్స్  చే సే అవకాశం వరించింది. అంతే కాదు తదుపరి కార్తీ సోదరుడు, స్టార్‌ హీరో సూర్యతో జతకట్టే అవకాశం తలుపు తట్టింది. ఇలా వరుసగా స్టార్‌ హీరోలతో నటించే అవకాశాలు రావడంతో ఇకపై ఇలాంటి ప్రముఖ కథానాయకుల చిత్రాలనే ఎంపిక చేసుకుని నటించాలని నిర్ణయం కూడా తీసేసుకుందట. ఇందుకు ప్రధాన కారణం పెద్ద హీరోల సరసన నటిస్తే పారితోషికం ఆ స్థాయిలోనే ముడుతుండడమే. ఇంకేముంది ఇక చిన్న హీరోలకు నో కాల్‌షీట్స్‌ అంటూ కోలీవుడ్, టాలీవుడ్‌లోనూ అలాంటి చిత్రాలను నిరాకరిస్తోందంటున్నారు సినీ వర్గాలు.

Videos

ప్రచారంలో మహిళలతో కలిసి డాన్స్ చేసిన వంశీ భార్య

వైఎస్సార్సీపీ మహిళా కార్యకర్తలపై బోండా ఉమా కొడుకు దాడి

పథకాలు ఆపగలరేమో.. మీ బిడ్డ విజయాన్ని ఎవరూ ఆపలేరు

దద్దరిల్లిన రాజానగరం

చంద్రబాబుపై నాన్-స్టాప్ పంచులు: సిఎం జగన్

కూటమిపై తుప్పు పట్టిన సైకిల్ స్టోరీ.. నవ్వులతో దద్దరిల్లిన సభ

వీళ్లే మన అభ్యర్థులు మీరేగెలిపించాలి..!

మళ్లీ వచ్చేది మీ బిడ్డ ప్రభుత్వమే..!

చంద్రబాబుకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు

పేదల పథకాలపై కూటమి కుట్ర..!

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?