amp pages | Sakshi

విలన్‌... ఫన్‌!

Published on Mon, 11/06/2017 - 00:57

వెండితెరపై విలన్లను చూస్తే ఎవరికైనా నవ్వొస్తుందా? అఫ్‌కోర్స్‌... కామెడీ విలన్లు ఉన్నారనుకోండి! కాసేపు వాళ్లను పక్కన పెట్టేసి, సీరియస్‌ విలన్ల సంగతికి వద్దాం! వాళ్లను చూస్తే నవ్వొస్తుందా? చూస్తున్నది తెరపైనే అయినా ఒక్కోసారి భయం వేస్తుంది. కానీ, ప్రభుదేవా ‘విలన్‌’ అంటే ‘ఫన్‌’ అంటున్నారు! ఎందుకిలా? అంటే... ‘మెర్క్యూరీ’ అనే తమిళ సినిమాలో ఈ కొరియోగ్రాఫర్‌ కమ్‌ యాక్టర్‌ కమ్‌ డైరెక్టర్‌ విలన్‌గా నటిస్తున్నారు. ఈ సంగతి ప్రేక్షకులకు తెలిసిందే! ‘విలన్‌గా నటించడం ఎలా ఉంది?’ అనే ప్రశ్నను ప్రభుదేవా ముందుంచితే – ‘‘ఇంతకు ముందెప్పుడూ విలన్‌గా  చేయలేదు. ఒక్కసారి ప్రపంచమంతా మారినట్టు, వింతగా అన్పిస్తోంది. బట్, ఇట్స్‌ ఫన్‌! యాక్టింగ్‌ అంటే అంతేగా... రియల్‌ లైఫ్‌లో మనం చేయలేని పనులను రీల్‌ లైఫ్‌లో చేసే చాన్స్‌ దొరుకుతుంది’’ అన్నారు.

మాటల్లేవ్‌... మాట్లాడుకోవడాలు లేవ్‌!
‘మెర్క్యూరీ’కి ఉన్న మరో స్పెషాలిటీ ఏంటంటే... మూకీ చిత్రమిది! నో డైలాగ్స్‌... ఓన్లీ యాక్షన్‌! కార్తీక్‌ సుబ్బరాజ్‌ ఈ చిత్రానికి దర్శకుడు. తమిళ్‌ డబ్బింగ్‌ హిట్‌ ‘పిజ్జా’ దర్శకుడీయనే. ‘పిజ్జా’లో హీరోయిన్‌గా నటించిన  రమ్యా నంబీసన్‌ ఇందులోనూ నటిస్తున్నారు. మూకీ సినిమా కావడంతో తెలుగు, హిందీ భాషల్లోనూ విడుదల చేయాలనుకుంటున్నారు. మూకీకి డబ్బింగ్‌ అవసరం లేదు... దాంతో ఎన్ని లాభాలో చూడండి!!

Videos

అంతా మాయ..సేమ్ 2 సేమ్.. 2024 మోదీ ఎన్నికల స్పీచ్ పై డిబేట్

కాసేపట్లో కర్నూలులో సీఎం జగన్ ప్రచారం

ఎన్నికల ప్రచారంలో మంత్రి రోజాకు అపూర్వ స్వాగతం

పచ్చ మద్యం స్వాధీనం..

బాబును నమ్మే ప్రసక్తే లేదు..

మహిళలపైనా పచ్చమూకల దాష్టీకం..

నేడు సీఎం జగన్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇదే

విజనరీ ముసుగేసుకున్న అవినీతి అనకొండ

విజయవాడలో సాక్షి ప్రజా ప్రస్థానం

పవన్, బాబు, లోకేష్ పై జోగి రమేష్ పంచులు

Photos

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)