amp pages | Sakshi

అదే నా చివరి చిత్రం : రాజమౌళి

Published on Thu, 03/14/2019 - 12:55

ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రెస్‌మీట్ సందర్భంగా దర్శకధీరుడు రాజమౌళి కీలక విషయాలను వెల్లడించారు. సినిమా కథా కథనాలు, నటీనటులు వివరాలతో ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్ కుసంబంధించి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. మహాభారతం ఎప్పుడు తెరకెక్కిస్తారన్న ప్రశ్నకు సమాధానంగా అదే నా చివరి చిత్రం అవ్వచ్చు.. అంటూ సమాధానం ఇచ్చారు. అలియా భట్‌.. సీతగా కథను మలుపు తిప్పే బలమైన పాత్రలో కనిపించనుందన్నారు. అదే సమయంలో అజయ్‌ దేవగన్‌ చేయబోయేది విలన్‌ పాత్ర కాదని క్లారిటీ ఇచ్చారు.

అల్లూరి సీతా రామరాజు, కొమరం భీం పోరాట యోధులుగా మారటానికి ముందు కొంత కాలం ప్రపంచానికి దూరంగా వెళ్లిపోయారు. ఆ సమయంలో వారు ఎక్కడున్నారు, యోధులుగా మారటానికి దారి తీసిన సంఘటనల నేపథ్యంలో ఈ కథను తయారు చేసుకున్నట్టుగా తెలిపారు. ఎ‍ట్టి పరిస్థితుల్లోనూ సినిమాను 2020లో రిలీజ్ చేస్తామన్నారు.
(చదవండి : ఆర్ఆర్‌ఆర్‌: అల్లూరిగా చరణ్‌, కొమరం భీంగా తారక్‌ )

చేగువరా జీవత కథ ఆధారంగా తెరకెక్కిన మోటర్‌ సైకిల్ డైరీస్‌ సినిమా చూస్తున్నప్పుడు అల్లూరి కథతో ఇలాంటి సినిమా చేస్తే బాగుంటుదన్న ఆలోచన వచ్చిందన్న జక్కన్న తరువాత కొమరం భీం కథ కూడా తెలుసుకున్నాక ఆర్‌ఆర్‌ఆర్‌ ఆలోచన వచ్చిందని తెలిపారు. బాహుబలి తరువాత గ్రాఫిక్స్ అవసరం లేని సినిమా చేయాలనకున్నా కుదరలేదన్నారు. ఈ సినిమాలో కూడా రాజమౌళి మార్క్‌ క్రియేటివ్‌ వెపన్స్‌ చూసే ఛాన్స్ ఉంటుందని అయితే అవి ఏంటన్నది తెర మీదే చూడాలన్నారు.

నిర్మాత దానయ్య మాట్లాడుతూ.. సినిమా నిర్మాణానికి 350 నుంచి 400 కోట్ల బడ్జెట్ అవుతుందని అంచనా వేస్తున్నట్టుగా తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌ను వదులుకుంటే 100 కోట్లు ఇస్తామంటూ ఆఫర్‌ వచ్చిన మాట నిజమే అన్న దానయ్య రాజమౌళితో సినిమా చేయాలన్న కోరికతోనే ఈ ప్రాజెక్ట్‌ను విడిచి పెట్టలేదని తెలిపారు. 2019 డిసెంబర్‌ లేదా 2020 జనవరిలో షూటింగ్ పూర్తవుతుందని తరువాత ఆరు నెలల పాటు నిర్మాణానంతర కార్యక్రమాలు చేసి జూలై 30 న సినిమా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలిపారు.


(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)