amp pages | Sakshi

పెళ్లయితే సినిమా హిట్‌ కాకూడదా?

Published on Sat, 03/24/2018 - 19:01

సాక్షి, ముంబై : పెళ్లయి తర్వాత గ్యాప్‌ తీసుకుంటున్న హీరోయిన్లు.. సెకండ్‌ ఇన్నింగ్స్‌లో ఎక్కువగా పాత్రా ప్రాధాన్యం ఉన్న చిత్రాలతో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అయితే ఈ క్రమంలో బాక్సాఫీస్‌ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నారు. కానీ, నాలుగేళ్ల తర్వాత తిరిగి ‘హిచ్‌కీ’తో రీఎంట్రీ ఇచ్చిన రాణీ ముఖర్జీ మాత్రం బాక్సాఫీస్‌ వద్ద దుమ్ము రేపింది. 

మొదటి రోజు ఆ చిత్రం రూ. 3కోట్ల 30లక్షలు వసూలు చేసి.. ఈ మధ్య రిలీజ్‌ వచ్చిన లేడీ ఓరియంటల్‌ చిత్రాల్లో తొలి రోజు వసూళ్లలో టాప్‌ స్థానంలో నిలిచింది. అయితే పెళ్లయితే వాళ్ల సినిమాలు హిట్‌ కాకూడదా? అని రాణీ ముఖర్జీ ఇప్పుడు ప్రశ్నిస్తోంది. ‘ఓ సినిమా విజయవంతం కావటానికి కావాల్సింది మంచి కథ, నటీనటుల ఫెర్‌ ఫార్మెన్స్‌. అంతేగానీ అందులో నటించేవారికి పెళ్లయ్యిందా? లేదా? అన్నది ముఖ్యం కాదు. వ్యక్తిగత జీవితాన్ని.. సినీ జీవితాన్ని బ్యాలెన్స్‌ చేయగలుగుతానా? అన్న అనుమానాల మధ్యే నటించటం మొదలుపెట్టాను. కానీ, నటనే నా జీవితం అన్న విషయం నాకు ఈ చిత్రం మళ్లీ గుర్తు చేసింది. ఈ విజయం ఇచ్చిన ఉత్సాహంతో నా కూతురు అదిరాను చూసుకుంటూనే.. ఇకపై నటనలోనూ కొనసాగుతా. ఆదరిస్తున్న వారికి నా కృతజ్ఞతలు’ అని ఆమె తెలిపారు. 

టూరెట్‌ సిండ్రోమ్‌తో బాధపడే ఓ మహిళ, టీచర్‌గా మారి వీధి బాలల బతుకులను మార్చాలని యత్నించటం... ఆ క్రమంలో అందరితో ఆమె అవమానాలు ఎదుర్కోవటం...ఆ ప్రయత్నంలో చివరకు విజయం సాధించటం అనే కథాంశంతో హిచ్‌కిని దర్శకుడు సిద్ధార్థ్‌ మల్హోత్రా తెరకెక్కించాడు.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)