ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
Breaking News
టాప్ టెన్‌లో రేవంత్
Published on Fri, 01/27/2017 - 23:11
తెలుగు ప్రేక్షకులకి రేవంత్ తెలుసు. ‘బాహుబలి’లో ‘మనోహరీ..’ పాటతో పాటు తెలుగు చిత్రాల్లో పలు హిట్ పాటలు పాడిన ఈ యువ గాయకుడి పేరు ఇప్పుడు బాలీవుడ్‌లోనూ వినిపిస్తోంది. సోనీ టీవీలో ప్రతి శనివారం మరియు ఆదివారం రాత్రి 8 గంటలకు ప్రసారమయ్యే సింగింగ్ రియాలిటీ షో ‘ఇండియన్ ఐడల్–9’లో రాకింగ్ ఫర్ఫార్మెన్స్తో రేవంత్ ముందుకు దూసుకువెళ్తున్నాడు.
ఆల్రెడీ టాప్ 10లోకి ఎంటరైన రేవంత్‌కి ఈ రోజు (శనివారం) జరగనున్న కాంపిటీషన్ కీలకంగా మారింది. ఇందులో విజయం సాధిస్తే రేవంత్ టాప్ 8లోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత అతను ‘ఇండియన్ ఐడల్–9 విన్నర్’గా నిలవడానికి ప్రేక్షకుల ఓటింగ్ (ఎస్సెమ్మెస్), మద్దతు చాలా అవసరమవుతాయి. ఇప్పటికే పలువురు రేవంత్‌పై అభిమానాన్ని సోనీ టీవీ ఫేస్బుక్ పేజీలో అతని వీడియోకి లైక్స్ కొడుతూ, మద్దతు ఇస్తున్నారు.
Tags