amp pages | Sakshi

ట్రయల్‌ షూట్‌!

Published on Sun, 06/14/2020 - 03:55

రాజమౌళి ట్రయల్‌ షూట్‌ ప్లాన్‌ చేశారు. ప్రçపంచవ్యాప్తంగా భారతీయ సినిమా సత్తా చాటిన ‘బాహుబలి’లాంటి సినిమా తెరకెక్కించిన రాజమౌళికి ట్రయల్‌ షూట్‌ చేయాల్సిన అవసరం ఏంటి? ఇంతకీ ఏ సినిమా కోసం ఈ ట్రయల్‌ షూట్‌ అనుకుంటున్నారా? మరేం లేదు... కరోనా ఎక్కడికీ వెళ్లలేదు. మనతోపాటే ఉంది. ఈ నేపథ్యంలో ఎవరి జాగ్రత్తలు వారు తీసుకుంటూ పనులు చేసుకుంటున్నారు. కొన్ని నియమ నిబంధనలు సూచించి, షూటింగ్స్‌ చేసుకోవచ్చని రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సినిమా పరిశ్రమవారికి అనుమతి ఇచ్చాయి.

తక్కువమంది సభ్యులతో షూటింగ్‌ చేయాలి, భౌతిక దూరం పాటించాలి.. వంటివన్నీ గైడ్‌లైన్స్‌లో ఉన్నాయి. ఇవి పాటిస్తూ... షూటింగ్స్‌ ఎలా చేయాలి? అని ఓ నిర్ణయానికి రావడం కోసమే ఈ ట్రయల్‌ షూట్‌ అని సమాచారం. ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ కాంబినేషన్‌లో రాజమౌళి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (రౌద్రం రణం రుధిరం) సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసమే సోమ, మంగళవారాల్లో హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో ట్రయల్‌ షూట్‌ జరపనున్నారట. 50 మంది సభ్యులతో డూప్‌ ఆర్టిస్టులతో ఈ షూట్‌ని ప్లాన్‌ చేశారని భోగట్టా. వచ్చే ఏడాది  విడుదల కానున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలో అజయదేవగన్, ఆలియా భట్‌ నటిస్తున్నారు. ఈ చిత్రానికి డి.వి.వి దానయ్య నిర్మాత.

Videos

అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో

ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!

ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR

టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..

అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు

ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డ అనలిస్ట్ KS ప్రసాద్

కవిత ఛార్జ్ షీట్ పై నేడు విచారణ..

వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన టీడీపీ..

అట్టహాసంగా మోడీ నామినేషన్

అక్కడ రీ-పోలింగ్ ?

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)