amp pages | Sakshi

సల్మానే నా హీరో

Published on Mon, 01/13/2014 - 00:52

బాడీగార్డ్ సినిమాలో సల్మాన్‌ఖాన్ అవకాశమిచ్చినా తిరస్కరించినందుకు వర్ధమాన తార డైసీ షా విచారం వ్యక్తం చేసింది. తాజా చిత్రం ‘జై హో’ లో సల్మాన్ సరసన డైసీ నటిస్తోంది. ‘ఒకే ఒక విషయమై విచారం వ్యక్తం చేస్తున్నా. ఎందుకంటే సల్మాన్‌కు నేను నో అని చెప్పినందుకు. సల్మాన్‌తో పని చేసినా చేయకపోయినా నా జీవితంలోకి సల్మాన్ అనే వ్యక్తి ప్రవేశించడమొక్కటి చాలు. రీల్ లైఫ్‌తోపాటు రియల్ లైఫ్‌లోనూ సల్మానే నా కథానాయకుడు. ఆయనను నేనొక కథానాయకుడిగా భావిస్తా.  ‘జై హో’లో సల్మాన్‌తో కలసి నటిస్తున్నా’ అని తెలిపింది. బాడీగార్డ్డ్ సినిమాలో కథానాయకుడి స్నేహితురాలి పాత్ర చేయాల్సిందిగా సల్మాన్...డైసీని కోరాడు. 
 
 అయితే ఆ పాత్ర ఆమెకు నచ్చలేదు. ‘నాకు ఇస్తానన్న ఆ పాత్రను అంగీకరించలేదు. అప్పట్లో నేనొక దక్షిణాది సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నా. దానికితోడు డేట్లు కూడా ఖాళీ లేవు. ఆ పాత్రలో నటించడాన్ని కొన్నాళ్లపాటు వాయిదా వేయడం కుదరలేదు. ఎప్పుడైనా ఒకదానిపైనే ఏకాగ్రత ఉండాలి. దీంతో నేను దక్షిణాది సినిమాకే మొగ్గుచూపా’ అని డైసీ వివరించింది. బాడీగార్డ్ సినిమాలో నటించననే విషయాన్ని తెలి యజేసేందుకు తనకు చాలా సమయం పట్టిందని తెలిపింది. నో అని ఎలా చెప్పాలో అర్ధంకాక ఏడెనిమిది రోజుల సమ యం తీసుకున్నానంది. అన్యమనస్కంగా ఏమి చేసినా వృథాయేననేది తన భావన అని తెలిపింది. తాను నో అని చెప్పిన తర్వాత సల్మాన్ ఏమీ అనలేదని, ఓకే అని మాత్రమే అన్నాడంది. బాడీగార్డు సినిమాలో తాను నటించలేదనే కోపం ‘జై హో’ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో సల్మాన్ ముఖంలో కనిపించిందని తెలిపింది. 

Videos

చంద్రబాబుపై మధుసూధన్ రెడ్డి సెటైర్లు

టీడీపీ, జనసేనకు బిగ్ షాక్...వైఎస్సార్సీపీలో భారీ చేరికలు

జగనన్న కోసం సింగపూర్ నుంచి వచ్చి ఎన్నారైల ప్రచారం

జోరుగా వైఎస్సార్సీపీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారం

అవ్వ కాళ్ళు కడిగిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి

అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు

మంగళగిరిలో లోకేష్ ప్రచారానికి కనిపించని జనాదరణ

భూములపై ప్రజలను భయపెట్టే కుట్ర..అడ్డంగా బుక్కైన అబ్బా కొడుకులు

అభివృద్ధికి కేరాఫ్ బుగ్గన...

వాడి వేడి ప్రసంగాలు..హోరెత్తిన జన నినాదం..

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌