అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
సల్మాన్‌తో కాదని అజయ్‌తో
Published on Sat, 04/16/2016 - 11:57
ఈ ఏడాది రంజాన్‌కు బాలీవుడ్ తెర మీద భారీ యుద్ధం తప్పదని భావించారు అంతా. సల్మాన్ హీరోగా తెరకెక్కుతున్న సుల్తాన్ సినిమాతో పాటు, షారూఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న రాయిస్ సినిమాలు ఈద్ బరిలో పోటీ పడతాయని అనుకున్నారు. అయితే సల్మాన్‌తో ఇప్పుడిప్పుడే బలపడుతున్న స్నేహం కారణంగా బరిలో నుంచి తప్పుకున్న షారూఖ్ తన సినిమాను వాయిదా వేసుకున్నాడు. దీంతో ఈద్ కు సోలోగా సత్తా చాటడానికి రెడీ అవుతున్నాడు సల్మాన్.
అయితే ఈద్ బరి నుంచి తప్పుకున్న షారూఖ్, తన సినిమా రాయిస్‌ను దీపావళికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. కానీ ఆ సమయంలో కూడా బాద్ షాకు పోటీ మాత్రం తప్పేలా కనిపించటం లేదు. అజయ్ దేవగన్ స్వీయ నిర్మాణంలో దర్శకత్వం వహిస్తూ హీరోగా నటిస్తున్న శివాయ సినిమాను దీపావళికే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. మరి సల్మాన్‌తో పోటీ వద్దని పక్కకు జరిగిన షారూఖ్, అజయ్ కోసం మరోసారి తన సినిమా వాయిదా వేసుకుంటాడా లేక బరిలో దిగుతాడా చూడాలి.
#
Tags