amp pages | Sakshi

అవకాశాలు రాలేదని బాధపడే వారికి  శంకర్‌ ఓ స్ఫూరి  – వీవీ వినాయక్‌ 

Published on Wed, 05/02/2018 - 00:17

శంకర్‌ హీరోగా శ్రీధర్‌. ఎన్‌ దర్శకత్వంలో ఎస్‌.కె.పిక్చర్స్‌ సమర్పణలో ఆర్‌.ఆర్‌. పిక్చర్స్‌ నిర్మిస్తోన్న చిత్రం ‘శంభో శంకర’.  మే డే సందర్భంగా ఈ సినిమాలోని ఫస్ట్‌ సాంగ్‌ను దర్శకుడు వీవీ వినాయక్‌ రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా వినాయక్‌ మాట్లాడుతూ– ‘‘శంకర్‌ రెండేళ్లు నాతో ట్రావెల్‌ చేశాడు. శ్రీకాకుళం నుంచి వచ్చి హీరోగా ఎదగడం ఆశ్చర్యంగాను, సంతోషంగాను ఉంది. సినిమాల్లో అవకాశాలు రావడం లేదని బాధపడే వాళ్లకు శంకర్‌ ఓ స్ఫూర్తి. ఫస్ట్‌ పాట బావుంది. శంకర్‌ మాస్‌ లుక్‌లో బావున్నాడు. సినిమా సక్సెస్‌ అయి, అందరికీ మంచి పేరు తీసుకు రావాలి’’ అన్నారు. ‘‘ఇండస్ట్రీలో నాకు వినాయక్‌గారు  గాడ్‌ఫాదర్‌. ఆయన వద్ద చాలా కాలం పనిచేసి, చాలా విషయాలు నేర్చుకున్నాను.

నా మిత్రుడు శ్రీధర్‌తో సినిమా చేస్తున్నాను. నిర్మాతలకు థ్యాంక్స్‌ చెప్పాలి. సినిమా మంచి హిట్‌ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు హీరో శంకర్‌. ‘‘శంకర్, నేను ఫ్రెండ్స్‌. ఈ సినిమాతో నేను డైరెక్టర్‌గా, శంకర్‌ హీరోగా పరిచయం అవ్వడం సంతోషంగా ఉంది. ఏది అడిగినా సమకూర్చిన నిర్మాతలకు థ్యాంక్స్‌’’ అన్నారు శ్రీధర్‌. ‘‘వినాయక్‌గారు ఈ సాంగ్‌ రిలీజ్‌ చేయడం ఆనందంగా ఉంది. శంకర్‌ స్టార్‌ హీరోల్లాగే కష్టపడ్డారు. శ్రీధర్‌ శ్రమించి స్క్రిప్ట్‌ చేశారు. నిర్మాత బడ్జెట్‌ విషయంలో రాజీపడలేదు. సినిమా హిట్‌ అవుతుందనడంలో ఎటువంటి డౌట్‌ లేదు’’ అన్నారు నిర్మాత సురేశ్‌ కొండేటి. నిర్మాతల్లో ఒకరైన రమణా రెడ్డి పాల్గొన్నారు.  

Videos

ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్

పొరపాటున బాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపే..!

జగనన్న రాకతో దద్దరిల్లిన గాజువాక సభ

గాజువాకలో జనజాతర

బీజేపీ, టీడీపీ, జనసేన తోడు దొంగలు..!

విశాఖ నుంచే ప్రమాణస్వీకారం చేస్తా

వీళ్లే మన అభ్యర్థులు.. ఈసారి ఢిల్లీ పీఠం కదలాలి

ఇచ్ఛాపురం బహిరంగ సభలో సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్

చంద్రబాబు చేసిన మోసాలు లైవ్ లో వినిపించిన సీఎం జగన్

బాబును చీల్చి చెండాడిన మహిళలు

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?