amp pages | Sakshi

కల్యాణం ఖరారు?

Published on Wed, 02/28/2018 - 01:15

పెళ్లి పీటల మీద కూర్చుని, మూడు ముళ్లు వేయించుకుని, ఏడడుగులు వేయడానికి శ్రియ రెడీ అయ్యారని సమాచారం. ‘మీ పెళ్లెప్పుడు?’ అని ఎప్పుడు అడిగినా ‘దాని గురించి నేను చెప్పను. అది నా వ్యక్తిగత విషయం’ అని నిర్మొహమాటంగా చెప్పేవారు శ్రియ. ఇటీవల ‘గాయత్రి’ సినిమా ప్రమోషనల్‌ ఇంటర్వ్యూస్‌లోనూ అలానే అన్నారు. అయితే శ్రియ సైలెంట్‌గా పెళ్లి పనులతో బిజీగా ఉన్నారన్నది తాజా వార్త. రష్యాకి చెందిన క్రీడాకారుడు, వ్యాపారవేత్త  ఆండ్రై కొశ్చీవ్, శ్రియ లవ్‌లో ఉన్నారని కొన్ని రోజుల క్రితం వార్త వచ్చింది.

ఈ ఇద్దరూ త్వరలో ‘వెడ్‌లాక్‌’లోకి ఎంటరవ్వాలనుకుంటున్నారట. ఇటీవల రష్యా వెళ్లి ఆండ్రై తల్లిదండ్రులను కూడా కలిశారట శ్రియ. పెద్దల సమ్మతం లభించిందని టాక్‌. వచ్చే నెల 17, 18, 19 తేదీల్లో రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వివాహ వేడుకలు జరుగుతాయని తెలిసింది. హోలీ థీమ్‌లో ఓ రోజు వేడుక, ఇంకో రోజు సంగీత్, మరో రోజు మెహందీ.. ఇలా మూడు వేడుకలను ఇప్పటికి ప్లాన్‌ చేశారట. మరి... మూడు ముళ్లు పడే డేట్‌ ఈ మూడు తేదీల్లో ఒకటా? లేక వేరేనా? అని తెలియాల్సి ఉంది. 

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)