amp pages | Sakshi

సెట్‌ ఇన్‌ ఇండియా

Published on Tue, 05/19/2020 - 00:37

హీరో – హీరోయిన్‌ కళ్లల్లో కళ్లు పెట్టుకొని ఒకరినొకరు ప్రేమగా చూసుకున్నారు. కట్‌ చేస్తే.. ఈఫిల్‌ టవర్‌ ముందుంటారు ఇద్దరూ. ఫారిన్‌ వీధుల్లో ప్రేమ పాట పాడుకుంటారు. విదేశాల్లో ఉంటూ స్వదేశ ప్రభుత్వాన్ని గడగడలాడిస్తుంటాడు విలన్‌. అతడ్ని పట్టుకోవడానికి ఫారిన్‌ బయలుదేరతాడు మన పోలీస్‌ హీరో. ఇలా పాటకో, ఫైటుకో, కొన్నిసార్లు కథానుసారం, కొన్ని సార్లు హంగామానుసారం విదేశాలలో షూటింగ్‌ చేస్తారు. కథా వస్తువులాగో, బ్యాక్‌ డ్రాప్‌ లాగానో, లేదంటే హంగామా కోసమో ‘విదేశాలు – విదేశీ లొకేషన్లు’’ మన సినిమాకి ఎప్పుడూ ఉపయోగపడుతున్నాయి. 

అయితే కరోనా వల్ల ఇక ఈ అనుబంధం కొనసాగుతుందా? సందేహమే! ఇండస్ట్రీకి కుడా ఈ పరిస్థితి ఇంకా అర్థం అవ్వడం లేదు. ప్రతిసారీ విదేశాలు వెళ్లకపోయినా ఆ మూడ్‌ ని మన స్టూడియోలలో సెట్‌ వేసి, ప్రతిబింబించేలా చేసిన సందర్భాలు ఉన్నాయి.  పలు సందర్భాల్లో న్యూయార్క్‌ వీధిని హైదరాబాద్‌ నానక్‌ రామ్‌ గూడకి తీసుకొచ్చాం. లండన్‌ నగరాన్ని మన హైదరాబాద్‌ స్టూడియోలలో నిర్మించుకున్నాం. నెక్ట్స్‌ అదే పద్ధతిని అందరూ పాటించాలా?  కరోనా ఎక్కడి వాళ్లను అక్కడే గప్‌ చుప్‌ సాంబార్‌ బుడ్డి అనేసింది.

దాంతో ఎక్కడివాళ్లు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. సినిమా షూటింగ్‌ లు ఎప్పుడు మొదలవుతాయి? ఒకవేళ మొదలయితే మునుపటి లాగా చేసుకునే వీలుందా? లేదా? ఈ సమయంలో ‘విదేశాల్లో షూటింగ్‌’’ ప్రస్తుతం ఇండస్ట్రీ ముందు ఉన్న అతి పెద్ద సవాల్‌. విదేశాల్లో షూట్‌ చేయడానికి ప్లాన్‌ చేసుకున్న సినిమాలు, ఆల్రెడీ సగం షూటింగ్‌ అయి మిగతా సగాన్ని పూర్తి చేయడానికి ఎదురు చూస్తున్న సినిమాల పరిస్థితి డైలమాలో పడింది. ఈ సినిమాల నెక్ట్స్‌స్టెప్‌ ఏంటి? ప్రత్యామ్నాయం ఏంటి? కొందరిని అడిగాం. ఈ విధంగా చెప్పారు.  ఆ వివరాలు.
 

ప్రభాస్‌ 20
రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ ఓ పీరియాడిక్‌ సినిమా చేస్తున్నారు. ఇటలీ బ్యాక్‌ డ్రాప్‌లో ఈ చిత్రకథ నడుస్తుంది. కరోనా విస్తృతంగా మొదలవుతున్న సమయంలోనూ జార్జియాలో ఓ షెడ్యూల్‌ పూర్తి చేశారు టీమ్‌. మళ్లీ షూటింగ్‌ ఎప్పుడు? నెక్ట్స్‌ ఏంటి? అని ఈ సినిమా ఆర్ట్‌ డైరెక్టర్‌ రవీందర్‌ని అడిగితే ఈ విధంగా స్పందించారు. ‘‘కరోనా వల్ల చిన్న సినిమా.. పెద్ద సినిమా అని కాదు.. సినిమాలన్నీ ఇబ్బందుల్లో పడ్డాయి. సినిమాలు కచ్చితంగా వాయిదా పడుతుంటాయి. 

ప్రభాస్‌, సాయిధరమ్‌ తేజ్‌

మా సినిమా కథానుసారం ఎక్కువ శాతం షూటింగ్‌ విదేశాల్లో జరిపాలి. కొన్ని రోజుల్లో లేదా నెలల్లో షూటింగ్‌లు ప్రారంభం అవుతాయి. ఆం్ర«ధ, తెలంగాణలో షూటింగ్స్‌ చేసుకోవచ్చు. కొంచెం ప్రయత్నించి ఇండియాలో తిరగొచ్చు. విదేశాలలో షూటింగ్‌ అనేది ఎలా వీలవుతుందా అని ఆలోచిస్తున్నాం. ప్రస్తుతానికి విదేశాల్లో చిత్రీకరించే ఇన్‌ డోర్‌ సన్నివేశాలన్నీ ఇక్కడే సెట్‌ వేసి షూట్‌ చేయాలని నిర్ణయించుకున్నాం. ఒక ఆరు నెలలు వేచి చూస్తాం. ఈలోగా ఇక్కడ షూటింగ్‌ పార్ట్, ఇన్‌ డోర్‌ మొత్తం పూర్తి చేయాలనుకుంటున్నాం. ఈ ఆరు నెలల్లో పరిస్థితిని బట్టి మా ప్లాన్‌ ఆఫ్‌ యాక్షన్‌ ఉంటుంది.

అయితే అందరూ ఇది చాలా పెద్ద ఇబ్బంది అనుకుంటున్నారు. కానీ నేను దీంట్లో ఓ భారీ ఛాలెంజ్‌ని చూస్తున్నాను. ఈ ఛాలెంజ్‌ని దాటగలిగితే ఫ్యూచర్‌ సినిమాలకు మార్గదర్శకంగా నిలుస్తాం. ఎగ్జాంపుల్‌ సెట్‌ చేస్తాం. విదేశాల్లో తీయాల్సిన పాటల్ని, సన్నివేశాల్ని అదే క్వాలిటీతో ఇక్కడ సెట్స్‌ ద్వారా సాధించగలిగితే ఫారిన్‌ వెళ్లే పనిని చాలా శాతం తగ్గించుకోవచ్చు. సినిమా అంటేనే ఛాలెంజ్‌ని ఎదుర్కొని అవుట్‌ పుట్‌ సంపాదించడం కదా?’’ అన్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌ గా నటిస్తున్న ఈ సినిమాను యువీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్‌ నిర్మిస్తున్నాయి.

పుష్ప
అల్లు అర్జున్‌ – సుకుమార్‌ కాంబినేషన్‌ లో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. మైత్రి మూవీ మేకర్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ‘పుష్ప’ సినిమాలో పలు కీలక సన్నివేశాలను మన రాష్ట్రాల్లోనే పూర్తి చేయాలని చిత్ర బృందం  భావిస్తోంది. ఈ విషయం గురించి ‘పుష్ప’ నిర్మాతల్లో ఒకరైన రవి శంకర్‌ మాట్లాడుతూ – ‘‘ప్రస్తుతం కరోనా వల్ల కావాలనుకున్న చోట షూటింగ్‌ చేయాలనుకోవడం కచ్చితంగా కుదరదు. మా సినిమాకు ఇంకా సెట్‌ వర్క్‌ ఏం స్టార్ట్‌ చేయలేదు.

కానీ అడవి ప్రాంతాల్లో షూటింగ్‌ ఎక్కువ శాతం ఉంది. చిత్తూరు, వికారాబాద్‌ అడవుల్లో షూట్‌ చేయాలనుకుంటున్నాం. ఒకవేళ అన్నీ కుదిరితే కేరళలో కొంత భాగం షూట్‌ చేస్తాం. మా బ్యానర్‌ లో మిగతా సినిమాల్లో ఏదైనా ఫారిన్‌ లో ఉంటే తర్వాత ఆలోచిస్తాం. సినిమా అంటేనే క్రియేషన్‌. క్రియేటివ్‌ వర్క్‌ని ఇక్కడే చేయాలి.. అక్కడే చేయాలని నిబంధనలు పెట్టుకోలేం. సో.. అన్ని సినిమాలూ ఇండియాలోనే చేస్తామా? అంటే ఇప్పుడే ఏం చెప్పలేం’’ అని పేర్కొన్నారు.

లవ్‌ స్టోరీ
నాగ చైతన్య – శేఖర్‌ కమ్ముల కాంబినేషన్‌ లో తెరకెక్కుతున్న చిత్రం ‘లవ్‌ స్టోరీ’. సాయి పల్లవి హీరోయిన్‌. 20 రోజుల షూటింగ్‌ బ్యాలెన్స్‌ ఉందట. ఈ సినిమాలో ఓ పాటను దుబాయ్‌లో చిత్రీకరించారు. ఇంకో పాటను కూడా మరో ఫారిన్‌ కంట్రీలో తీయాలన్నది ప్లాన్‌. కానీ ఆ ప్లాన్‌ మారిపోయింది. ఇండియాలోనే ఈ పాటను షూట్‌ చేయాలని చిత్రబృందం నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

‘లవ్‌ స్టోరీ’లో నాగచైతన్య, సాయిపల్లవి

ఫైటర్‌
పూరి జగన్నాథ్‌ – విజయ్‌ దేవరకొండ ఓ యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌ కోసం కలసిన సంగతి తెలిసిందే. బాక్సింగ్‌ బ్యాక్‌ డ్రాప్‌ లో సాగే ఈ ప్యాన్‌ ఇండియా సినిమాకు ‘ఫైటర్‌’ అనే టైటిల్‌ అనుకుంటున్నారు. పూరి, ఛార్మి, కరణ్‌ జోహార్‌ నిర్మిస్తున్నారు.  ముంబై – ఫారిన్‌ నేపథ్యంలో ఈ కథ సాగుతుందని తెలిసింది. బ్యాక్‌ డ్రాప్‌లో కొంత ఫారిన్‌ కాబట్టి అక్కడ షూటింగ్‌ తప్పనిసరి అట. అంతా చక్కబడే వరకు ఓ నిర్ణయానికి రాలేమని చిత్రబృందం నుంచి సమాచారం.

‘ఫైటర్‌’లో విజయ్‌ దేవరకొండ, అనన్యా పాండే

మోసగాళ్ళు
ఇంగ్లిష్‌ – తెలుగు భాషల్లో మంచు విష్ణు ఓ భారీ క్రాస్‌ ఓవర్‌ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ‘మోసగాళ్ళు’ టైటిల్‌ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి జెఫ్రీ గీ చిన్‌ దర్శకుడు. ఓ ఐటీ స్కామ్‌ ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలోని కీలక భాగాన్ని అమెరికాలో షూట్‌ చేశారు. చిత్రీకరణ దాదాపు పూర్తయింది. మిగతా భాగాన్ని అమెరికాలోనే తీయాలనుకుంటున్నారు.  ఈ చిత్రంలో నటించడంతోపాటు నిర్మిస్తున్నారు విష్ణు.

‘మోసగాళ్ళు’లో విష్ణు

మరికొన్ని...
రవితేజ ‘క్రాక్‌’ సినిమా పాటల మినహా షూటింగ్‌ పూర్తి అయింది. ఈ పాటల్ని ఫారిన్‌ లో చిత్రీకరించాలని అనుకున్నారు. ఇప్పుడు ఊటీ లేదా మున్నార్‌ వంటి ప్రదేశాల్లో పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నారని తెలిసింది. నాగార్జున ‘వైల్డ్‌ డాగ్‌’ చిత్రం బ్యాంకాక్‌ షెడ్యుల్‌ పూర్తి చేయాల్సి ఉంది. అది కూడా డైలమాలో ఉంది.  సాయి ధరమ్‌ తేజ్‌ ‘సోలో బతుకే సో బెటర్‌’ చిత్రంలో ఉన్న ఫారిన్‌ షెడ్యూల్స్‌ ని ఇండియాలోనే చేయాలని ప్లాన్‌ చేసినట్లు తెలిసింది.

‘క్రాక్‌’లో రవితేజ, శ్రుతీహాసన్‌..

సో  కరోనా వల్ల కథల్లో మార్పు రాబోతోందా? కథ జరిగే ప్రదేశాల్లో మార్పు ఉండబోతోందా? కథలన్నీ మన దగ్గరే సెట్‌ చేస్తారా? లేదంటే కావాల్సిన ప్రదేశాల సెట్‌ వేస్తారా?  రాబోయే రోజుల్లో సినిమా కథలన్నీ ‘సెట్‌ ఇన్‌ ఇండియా’యేనా? కావాల్సిన లొకేషన్స్‌ ని సెట్లుగా మార్చుకోవడమేనా? చూస్తుంటే అదే అయ్యేలా ఉంది. అదే జరిగితే క్రియేటివ్‌ గా కొంచెం రాజీ పడాలేమో? ఈ సరికొత్త ఛాలెంజ్‌ ను ఇండస్ట్రీ ఎలా తీసుకుంటుంది? ప్రతిదానికీ ప్లాన్‌ ఎ వర్కవుట్‌ కాకపోతే ప్లాన్‌ బి ఉంటుంది. ఇప్పుడు ఇండస్ట్రీ ప్లాన్‌ బి ఆలోచిస్తోందా? రానున్న రోజులు ఈ ప్రశ్నలకు సమాధానాలు చెబుతాయి.


– గౌతమ్‌ మల్లాది


Videos

వాడి వేడి ప్రసంగాలు..హోరెత్తిన జన నినాదం..

ప్రచార జోరు: వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులకు ప్రజల నుంచి అపూర్వ స్పందన

సీఐడీ నోటీసులు..దుష్ప్రచారాలపై విచారణ షురూ..

ఈరోజు సీఎం జగన్ షెడ్యూల్

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌