amp pages | Sakshi

సూప‌ర్ స్టార్ కృష్ణ చేతుల మీదుగా ‘ఓ మ‌నిషి నీవెవ‌రు’

Published on Mon, 05/13/2019 - 14:41

రిజ్వాన్ క‌ల్షాన్, సుమ‌న్, చ‌ల‌ప‌తిరావు, హ‌రి, త‌రుణ్ కుమార్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కుతోన్న చిత్రం ‘ఓమ‌నిషి నీవెవ‌రు’. గాడ్ మినీస్ర్టీస్ స‌మ‌ర్ప‌ణ‌లో స్వ‌ర్ణ క్రియేష‌న్స్ ప‌తాకంపై కృష్ణ మూర్తి రాజ్ కుమార్  నాయుడు ద‌ర్శ‌క‌త్వంలో స్వ‌ర్ణ కుమారి దొండ‌పాటి నిర్మిస్తున్నారు. ప్ర‌భాక‌ర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా ఆడియో ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం సూప‌ర్ స్టార్ కృష్ణ స్వగృహంలో ఆయన చేతుల మీదుగా జ‌రిగింది. అనంతరం ప్రసాద్ ల్యాబ్ లో మొదటీ వీడియో సాంగ్ ను త‌నికెళ్ల భ‌ర‌ణి, సంగీత ద‌ర్శ‌కుడు అనూప్ రూబెన్స్ విడుద‌ల చేసారు.

త‌నికెళ్ల భ‌ర‌ణి మాట్లాడుతూ ‘జీస‌స్ అంటే ప్రేమ‌, శాంతి. ఇలాంటి సినిమా వేడుక‌ల్లో పాల్గొన‌డం అంటే నాకు సంతోషంగా ఉంటుంది. ఈ సినిమా డీవోపి నాకు బంధువు. ఆ కార‌ణంగానే వేడుక‌కు త‌ప్ప‌క హాజ‌రు కావాల్సి వ‌చ్చింది. సినిమా అంద‌రికీ మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు తీసుకురావాల‌ని కోరుకుంటున్నా’ అని అన్నారు. ‘ఇలాంటి సినిమాలు చేయాలంటే చాలా ధైర్యం కావాలి. చ‌క్క‌ని సందేశాత్మ‌క చిత్ర‌మిది. పాట‌లు బాగున్నాయి’ అని అనూప్‌ రూబెన్స్‌ అన్నారు.

సుమ‌న్ మాట్లాడుతూ ‘నాకు కులం, మ‌తం, ప్రాంతం లాంటి బేధాలు లేవు. నా దృష్టిలో అంతా ఒక్క‌టే. చెన్నైలో క్రిస్టిన్స్ స్కూల్ లోనే చ‌దువుకున్నా. నా త‌ల్లిదండ్రుపై క్రిస్టియ‌న్స్ ప్ర‌భావం ఉంది. అలా నేను కూడా జీస‌స్  ఆక‌ర్షితుడినే. ఈ సినిమాలో పాత్ర చెప్ప‌గానే  ఆలోచించ‌కుండా  చేస్తాన‌ని చెప్పాను. చాలా వైవిథ్యంగా, క‌ష్టంగా  ఉండే పాత్ర కూడా. ఇలాంటి సినిమాలు చేయాలంటే చాలా ధైర్యం ఉండాలి. న‌టులంద‌రికీ ఎంతో క‌మిట్ మెంట్ ఉండాలి. అది ఈ సినిమా యూనిట్ లో చూసాను. ఇలాంటి సినిమాలు  చేయాలంటే అదృష్టం కూడా ఉండాలి. ఏసు పాత్ర‌కు రిజ్వాన్ బాగా సూట‌య్యాడు. అన్ని పాట‌ల్లో ఫీల్ ఉంది. సినిమా విజ‌యం సాధించి అంద‌రికీ మంచి పేరు తీసుకొస్తుంద‌న్న న‌మ్మ‌కం ఉంద’ని అన్నారు.

Videos

ఫ్రెండ్‌ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్‌ (ఫోటోలు)

రాజధానిపై కూటమి కుట్ర బట్ట బయలు చేసిన దేవులపల్లి

పిఠాపురంలో పవన్ చిత్తు చిత్తు.. ప్రచారంలో వంగా గీత కూతురు అల్లుడు

నా స్కూటీని తగులబెట్టారు: రాగ మంజరి చౌదరి

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కడుపుమంట అదే : నాగార్జున యాదవ్

చంద్రబాబుపై రైతుల ఆగ్రహం

టీడీపీ నేతల రౌడీయిజం.. YSRCP నేతలపై దాడులు

దాడులకు పబ్లిక్ గా బరితెగించిన లోకేష్

అట్టర్ ప్లాప్ .. పవన్ కళ్యాణ్ స్పీచ్ పబ్లిక్ జంప్

బాబు షర్మిల సునీతల అసలు ప్లాన్ ఇదే..!

Photos

+5

హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)