amp pages | Sakshi

సూపర్‌స్టార్‌ కొత్త చిత్రానికి పచ్చజెండా

Published on Fri, 08/25/2017 - 01:25

తమిళసినిమా: సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ తదుపరి చిత్రం ఏమిటన్న విషయంలో చాలా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వంలో 2.ఓ చిత్రాన్ని పూర్తి చేసిన రజనీకాంత్‌ తన అల్లుడు, నటుడు ధనుష్‌ నిర్మిస్తున్న కాలా చిత్రంలో నటిస్తున్నారు. దీనికి పా.రంజిత్‌ దర్శకుడు.కాగా 2.ఓ చిత్రం 2018 జనవరిలో విడుదలకు సిద్ధం అవుతోంది. కాలా చిత్రాన్ని సమ్మర్‌ స్పెషల్‌గా విడుదలకు చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే రజనీకాంత్‌ తదుపరి చిత్రం ఏమిటన్న ఆసక్తిగా మారింది. ఇందుకు కారణం లేకపోలేదు.

రజనీకాంత్‌ రాజకీయరంగప్రవేశం చేయబోతున్నారని, త్వరలోనే పార్టీ పేరు, అజెండాను వెల్లడించడానికి చురుగ్గా పనులు జరుగుతున్నాయనే ప్రచారం ఊపందుకుంది. మరో పక్క దర్శకుడు వెట్రివేలన్‌ రజనీకాంత్‌ను దర్శకత్వం వహించనున్నారని, ఆయన చెప్పిన చరిత్ర కథ రజనీకి బాగా నచ్చేసిందనే ప్రచారం ఈ మధ్య జోరందుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో సూపర్‌స్టార్‌ తదుపరి చిత్రం ఏమిటన్న విషయంలో క్లారిటి వచ్చింది. ప్రముఖ దర్శకుడు ఏఆర్‌.మురుగదాస్‌ దర్శకత్వంలో రజనీకాంత్‌ నటించబోతున్నారు. ఈ విషయమై చర్చలు కూడా పూర్తి అయ్యాయి.

దీని గురించి దర్శకుడు ఏఆర్‌.మురుగదాస్‌నే స్వయంగా వెల్లడించారు. ప్రస్తుతం ఆయన టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు కథానాయకుడిగా తమిళం,తెలుగు భాషలలో స్పైడర్‌ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. రకుల్‌ప్రీత్‌సింగ్‌ నాయకిగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ ఒక్క పాట మినహా పూర్తి అయ్యింది. సెప్టెంబర్‌ చివరిలో విడుదలకు ముస్తాబవుతోంది. ఈ చిత్ర ప్రమోషన్‌లో దర్శకుడు ఏఆర్‌.మురుగదాస్‌ తాను రజనీకాంత్‌ హీరోగా చిత్రం చేయనున్నట్లు తెలిపారు. ఇది కాలా చిత్రం తరువాత ఉంటుందని, 2017 చివరలో ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు. ఆయన తాజాగా విజయ్‌ హీరోగా చిత్రం చేయడానికి సిద్ధం అవుతున్నారన్నది గమనార్హం.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)