amp pages | Sakshi

తాప్సీ ‘థప్పడ్‌’ మూవీ రివ్యూ

Published on Fri, 02/28/2020 - 10:33

టైటిల్‌: థప్పడ్‌
నటీనటులు: తాప్సీ పన్ను, దియా మీర్జా, కముద్‌ మిశ్రా, రత్నా పాఠక్‌ షా, తన్వీ అజ్మీ, పావిల్‌ గులాటి
సంగీతం: అనురాగ్‌ సాకియా, మంగేశ్‌ థాకడే
దర్శకత్వం: అనుభవ్‌ సిన్హా
నిర్మాతలు: భూషణ్‌కుమార్‌, కృష్ణన్‌ కుమార్‌, అనుభవ్‌ సిన్హా

టాలీవుడ్‌ ద్వారా వెండితెరకు పరిచయమైన ఢిల్లీ భామ తాప్సీ ప్రస్తుతం వరుస సినిమాలతో బాలీవుడ్‌లో దూసుకుపోతున్నారు. తొలుత గ్లామర్‌ పాత్రలకే పరిమితమైన ఆమె... విభిన్న పాత్రలు ఎంచుకుంటూ నటిగా తనను తాను నిరూపించుకుంటున్నారు. ఆమె నటించిన పింక్‌, బేబీ, నామ్‌ షబానా, ముల్క్‌, బద్లా, సాంధ్‌ కీ ఆంఖ్‌ వంటి చిత్రాలు ఇందుకు నిదర్శనం. ఇక సామాజిక అంశాలపై తనదైన శైలిలో స్పందించే తాప్సీ తాజాగా నటించిన చిత్రం థప్పడ్‌(చెంపదెబ్బ అని అర్థం). ముల్క్‌, ఆర్టికల్‌ 15 సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అనుభవ్‌ సిన్హా ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఒకే ఒక చెంపదెబ్బ ఓ మహిళ జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకువచ్చింది.. ఆమెకు తన అస్థిత్వాన్ని ఎలా గుర్తు చేసింది తదితర అంశాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

‘చెంపదెబ్బ’ అనే చిన్నపాయింట్‌తో తెరకెక్కడం.. భర్త అహం కారణంగా భార్య మనస్సులో చెలరేగిన కల్లోలం.. దాని కారణంగా వివాహ బంధం బీటలు వారిన తీరు తదితర సున్నితమైన భావోద్వేగాలతో రూపొందిన ఈ సినిమా ఎలాంటి ముగింపు తీసుకుందనే విషయం తెరపై చూడాల్సిందే. 

కథ ఏంటంటే..
అమృత సబర్వాల్‌(తాప్సీ పన్ను) ఓ సాధారణ గృహిణి. భర్త విక్రమ్‌(పావిల్‌ గులాటి)తో కలిసి ఢిల్లీలో నివసిస్తూ ఉంటుంది. డ్యాన్సర్‌గా గుర్తింపు తెచ్చుకోవాలన్న తన ఆశయాన్ని పక్కనబెట్టి మరీ భర్త, డయాబెటిక్‌ పేషెంట్‌ అయిన అత్త(తన్వీ అజ్మీ)కి సేవలు చేస్తూ ఉంటుంది. కుటుంబానికి సేవ చేయడం, భర్త ఎదుగుదలలోనే తన సంతోషాన్ని వెదుక్కుంటుంది. అయితే విక్రమ్‌ కూడా భార్యను ప్రేమగానే చూసుకున్నా.. పితృస్వామ్య భావజాలం కారణంగా.. ఓ రకమైన అహాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు. భార్య కంటే కూడా పనిమీదే ఎక్కువ శ్రద్ధ కనబరుస్తూ ఉంటాడు. ఇలా వారి జీవితం సాగిపోతున్న సమయంలో విక్రమ్‌.. ఏర్పాటు చేసిన ఓ పార్టీ అమృత ఆలోచనలను మార్చివేస్తుంది. అందరి ముందు భర్త తనను కొట్టిన చెంపదెబ్బకు సమాధానం వెదికే క్రమంలో విడాకులు తీసుకోవాలనే నిర్ణయానికి వస్తుంది. ఈ క్రమంలో ఆమె ఎదుర్కొన్న సవాళ్లు, వేధింపులు, సొంత వాళ్ల నుంచి ఎదురయ్యే ఒత్తిడులు.. వీటన్నింటినీ అధిగమించి ఆత్మగౌరవం కోసం తను పోరాడిన తీరు ప్రధానంగా దర్శకుడు కథను అల్లుకున్నాడు. 

ఎలా ఉందంటే...
అమృత- విక్రమ్‌ల అనుబంధం... వైవాహిక జీవితంలో చిన్న చిన్న సర్దుబాట్లు.. ఇలా దాదాపుగా ప్రతీ ఇంట్లో కనిపించే సాధారణ దృశ్యాలను తెరపై చూపించిన దర్శకుడు.. విక్రమ్‌.. అమృతపై చేయిచేసుకునే సన్నివేశంతో కథను కీలక మలుపు తిప్పాడు. భర్తకు అన్ని సౌకర్యాలు అమర్చిపెట్టే అమృత... ఇలా భర్త తనను అందరి ముందు చెంపదెబ్బ కొట్టడాన్ని ఎలా పరిగణిస్తుంది? ప్రతీ బంధంలోనూ సర్దుబాట్లే తప్ప నిజమైన ప్రేమ ఉండదని గ్రహిస్తే ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది? తను చేసిన న్యాయపోరాటంలో గెలిచిందా లేదా వంటి సున్నిత భావోద్వేగాలతో కథను నడిపించాడు. ఆడ అయినా మగ అయినా ప్రతీ మనిషికీ ఆత్మగౌరవం ఉంటుందని మరోసారి గుర్తుచేశాడు. ఏ పరిస్థితుల్లో భార్యపై చేయి చేసుకున్నా అది గృహహింస కిందకే వస్తుందని సగటు భర్తలకు కనువిప్పు కలిగించే ప్రయత్నం చేశాడు. 

‘‘నీ కోసం నా జీవితం ధారబోశాను కాబట్టి నువ్విలా చేయకుండా ఉండాల్సింది’’ అంటూ భర్త నుంచి విడిపోయేందుకు సిద్ధమైన అమృత.. విడాకుల కోసం లాయర్ దగ్గరికి వెళ్తే.. ‘‘నీ భర్తకు లేదా నీకు వివాహేతర సంబంధం ఉందా.. ఒక్క చెంపదెబ్బకే విడాకుల దాకా వెళ్తావా అంటూ మహిళా లాయర్‌ ప్రశ్నించే తీరు.. వైవాహిక జీవితం సాఫీగా సాగిపోవాలంటే ఇలాంటి చిన్న చిన్న విషయాలు పట్టించుకోవద్దంటూ తల్లి ఆమెకు చెప్పే మాటలు ఆలోచింపజేసేవిగా ఉన్నాయి. ఈ న్యాయ పోరాటంలో కేవలం తను మాత్రమే కాకుండా.. తనలాంటి ఎంతో మంది సగటు గృహిణులు.. గృహహింసను కూడా ‘ప్రేమ, బంధం’లో భాగమేనంటూ సర్దిచెప్పుకొంటున్నారనే విషయాన్ని తెలుసుకున్న అమృత.. ఈ ఆలోచనా విధానంలో మార్పు తీసుకురావడానికి నడుం కట్టడం.. చెంపదెబ్బకే విడాకుల దాకా వెళ్లడం ఎంతవరకు సమంజసం అంటూ చుట్టుపక్కల వారు ప్రశ్నించినా.. ‘‘ ఈ సమాజంలో మార్పు రావాలంటే నా పని నన్ను చేసుకోనివ్వండి. మీ పని మీరు చేసుకోండి’’ అంటూ తన అస్థిత్వం కోసం పోరాడిన విధానం ప్రేక్షకులను ఆలోచింపజేస్తుంది.

ఎవరెలా నటించారంటే..
థప్పడ్‌ సినిమాతో తాప్సీ నటిగా మరో మెట్టు ఎక్కారని చెప్పవచ్చు. సాధారణ గృహిణిగా, ఆత్మగౌరవం కోసం పోరాడే స్త్రీగా తన పాత్రలోని రెండు విభిన్న కోణాలను తెరపై చక్కగా ఆవిష్కరించారు. ఇక తాప్సీ భర్తగా నటించిన పావిల్‌ గులాటి తన పరిధి మేరకు నటించగా... తాప్సీ తండ్రి పాత్రలో నటించిన కుముద్‌ మిశ్రా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. తాప్సీ తల్లిగా నటించిన రత్నా పాఠక్‌ షా, పక్కింటి మహిళగా దియా మీర్జా పాత్రలు ఆలోచింపచేసేవిగా ఉంటాయి. ఓవరాల్‌గా ఈ సినిమా లింగ సమానత్వానికై కృషి చేసేవాళ్లు, భావోద్వేగాలను అర్థం చేసుకునే వారిని అలరించినా.. ఓ వర్గం ప్రేక్షకులకు మాత్రం కోపం తెప్పిస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ముల్క్‌, ఆర్టికల్‌ 15 సినిమాలతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న అనుభవ్‌ సిన్హా.. మూడో సినిమాలోనూ సామాజిక సందేశం మిళితం చేసి.. తన మార్కును చూపించాడు. భార్యపై చేయిచేసుకునే భర్తలను సమర్థించే సమాజపోకడలకు తనదైన స్టైల్లో ‘చెంపదెబ్బ’ కొట్టినట్లుగా సమాధానం ఇచ్చాడు.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)