amp pages | Sakshi

అధర్వ కోసం రూ.కోటి సెట్‌

Published on Tue, 03/13/2018 - 05:00

తమిళసినిమా: సినిమాకు గ్లామర్‌తో పాటు భారీతనం చాలా అవసరం. అదే విధంగా కొత్తదనం కూడా ఉండాలి. అందుకే యువ నటుడు అధర్వ చిత్రంలోని ఒక్క పాట కోసమే కోటి రూపాయల ఖర్చుతో బ్రహ్మాండమైన సెట్‌ను వేశారు. నటుడు అధర్వ నటిస్తున్న తాజా చిత్రం బూమరాంగ్‌. టైటిల్‌లోనే కొత్తదనం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. చిత్రం కూడా జనరంజకంగా ఉంటుందంటున్నారు ఈ చిత్ర దర్శక నిర్మాత ఆర్‌.కన్నన్‌. అవును ఇంతకు ముందు పలు విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన ఈయన తాజాగా మసాలా పిక్చర్స్‌ పతాకంపై నిర్మిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం బూమరాంగ్‌.

ఇందులో అధర్వకు జంటగా నటి మేఘాఆకాశ్, ఉపన్‌పటేల్‌ నటిస్తున్నారు. ఇందులో ఒక పాట కోసం కళాదర్శకుడు శివ రూ. కోటి వ్యయంతో బ్రహ్మాండమైన సెట్‌ను రూపొందించారట. దీని గురించి దర్శక నిర్మాత ఆర్‌. కన్నన్‌ తెలుపుతూ సమాజానికి అవసరం అయిన ఒక ముఖ్యమైన, చాలా బలమైన అంశం గురించి చెప్పే భారీ యాక్షన్‌ కథా చిత్రంగా బూమరాంగ్‌ ఉంటుందన్నారు. ఈ చిత్రంలో దేశం గురించి ఒక పాట చోటు ఉంటుందన్నారు. ఈ పాట కోసం ఒక బ్రహ్మాండమైన భారీ సెట్‌ను వేసినట్లు తెలిపారు.

సంగీతదర్శకుడు రతన్, గీతరచయిత వివేక్‌ల పాట అద్భుతంగా రావాలన్న తన కలను అర్థం చేసుకుని తాను ఊహించిన దానికంటే బెటర్‌ పాటను అందించారని అన్నారు. మేయాదమాన్‌ చిత్రం ఫేమ్‌ ఇందుజా తమ చిత్రంలో చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నారని తెలిపారు. ఈ పాత్రను ఎవరు పాషించాలన్న చర్చ జరిగినప్పుడు చిత్ర యూనిట్‌ అంతా ఏకగ్రీవంగా ఇందుజా పేరునే చెప్పారన్నారు. చిత్ర షూటింగ్‌ ప్రణాళిక బద్దంగా చాలా వేగంగా జరుగుతోందని ఆర్‌.కన్నన్‌ చెప్పారు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌