amp pages | Sakshi

విజయ్‌సాయి ఆత్మహత్య.. అసలు విషయం ఇదే!

Published on Mon, 12/11/2017 - 12:13

సాక్షి, సినిమా : తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ‘అమ్మాయిలు–అబ్బాయిలు’ ఫేమ్, హాస్య నటుడు కాలే విజయ్‌సాయి(40) సోమవారం ఆత్మహత్య చేసుకున్నారు. యూసుఫ్‌ గూడలోని సొంత ఫ్లాట్‌లో తన గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆత్మ హత్యకు ముందు ఓ సెల్ఫీ వీడియోలో విజయ్‌ మాట్లాడుతూ.. భార్య వనితతో పాటు ముగ్గురిపై ఆరోపణలు చేశారు. ఈ ఉదంతానికి సంబంధించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న జూబ్లీహిల్స్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

బెడ్‌రూంలో ఉరి వేసుకుని..
యూసుఫ్‌గూడలోని శ్రీనివాసం అపార్ట్‌మెంట్‌లో తండ్రి సుబ్బారావు, తల్లి వరలక్ష్మమ్మతో కలిసి విజయ్‌ నివసిస్తున్నారు. సోమవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో తన బెడ్‌రూంలో చీరతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని చనిపోయిన స్థితిలో విజయ్‌ కనిపించారు. రెండేళ్లుగా విజయ్‌ ఆయన భార్య వనిత(32) అలియాస్‌ వరలక్ష్మి అలియాస్‌ విన్నితో గొడవలు జరుగుతున్నాయి. విడివిడిగా జీవిస్తున్న వీరి విడాకుల కేసు న్యాయస్థానం పరిధిలో ఉంది. వీరి కుమార్తె కుందన(7) కోర్టు ఆదేశాల మేరకు నిర్ణీత సమయం తండ్రితో ఉంటోంది. సోమవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో విజయ్‌ను కలవడానికి ఆయన స్నేహితుడు సాయి వచ్చారు. ఈ నేపథ్యంలో వరలక్ష్మమ్మ అల్పాహారం సిద్ధం చేస్తుండగా.. స్నానం చేసి వస్తానంటూ విజయ్‌ బెడ్‌రూంలోకి వెళ్లాడు. దాదాపు గంట కావస్తున్నా అతడు బయటకు రాకపోవడంతో స్నేహితుడు సాయితో పాటు తల్లి బెడ్‌రూమ్‌ వద్దకు వెళ్లి పలుమార్లు విజయ్‌ని పిలిచారు. ఎలాంటి స్పందనా లేకపోవడంతో తలుపులు పగలగొట్టి లోపలకు ప్రవేశించగా.. ఫ్యాన్‌కు ఉరివేసుకుని వేలాడుతున్న స్థితిలో విజయ్‌ కనిపించారు. వెంటనే కిందకు దింపి చూడగా అప్పటికే విజయ్‌ మరణించినట్లు గుర్తించారు. దీనిపై సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్‌ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. విజయ్‌కు ఇటీవల సినిమా అవకాశాలు తగ్గిపోయాయని, ఈ నేపథ్యంలోనే నిరాశకులోనై ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు భావించారు. అయితే దర్యాప్తులో భాగంగా మృతుడి సెల్‌ఫోన్‌ను పరిశీలించిన పోలీసులు.. అందులో నాలుగు నిమిషాల నిడివితో ఓ సెల్ఫీ వీడియో ఉన్నట్లు గుర్తించారు. ఆ వీడియోలో విజయ్‌ ధరించిన వస్త్రాలు, వీడియోలో ఉన్న వాటిని పోల్చిన పోలీసులు.. చనిపోవడానికి కొద్దిసేపటి ముందే దాన్ని చిత్రీకరించినట్లు గుర్తించారు. దీన్ని విశ్లేషణ నిమిత్తం ఫోరెన్సిక్‌ సైన్స్‌ లేబొరేటరీకి పంపారు. విజయ్‌ అమ్మాయిలు అబ్బాయిలు, ఒకరికి ఒకరు, మంగళ, కరెంట్, వరప్రసాద్‌ పొట్టిప్రసాద్, బొమ్మరిల్లు, నా గర్ల్‌ ఫ్రెండ్‌ బాగా రిచ్, ఇందుమతి, ఏకలవ్యుడు తదితర సినిమాల్లో నటించారు.

ఆ ముగ్గురే కారణమంటూ సెల్ఫీ వీడియో..
తన చావుకు భార్య వనితతో పాటు ప్రముఖ పారిశ్రామికవేత్త శశిధర్‌(నవయుగ సంస్థ), అడ్వొకేట్‌ శ్రీనివాస్‌ కారణమని సెల్ఫీ వీడియోలో విజయ్‌ వెల్లడించారు. వనిత తనకు వాల్‌పోస్టర్‌ సినిమా షూటింగ్‌లో పరిచయమైందని, పెళ్ళైన తర్వాతే ఆమె నిజస్వరూపం తెలిసిందని వాపోయాడు. పారిశ్రామికవేత్త సీవీ రావ్‌ తదితరులు వ్యాపార అవసరాలకు వనితను ఉపయోగించుకున్నారని, వారితో సన్నిహితంగా ఉంటున్న తన భార్య అనైతిక కార్యకలాపాలకు పాల్పడినట్లు ఆరోపించారు. ఆ విషయం తనకు తెలిసినప్పటి నుంచి తమ మధ్య గొడవలు ప్రారంభమయ్యాయని చెప్పారు. చివరకు వనిత తమ కూతురిని కూడా చూడనివ్వడం లేదని అన్నారు. తనకు సంబంధించిన కొన్ని వీడియోలు ఉన్నాయని, అవి బయటపెడుతానని బెదిరించిన అడ్వొకేట్‌ శ్రీను రూ.3 కోట్లు డిమాండ్‌ చేసినట్లు వీడియోలో చెప్పారు. వీరంతా తనను తీవ్రస్థాయిలో మానసికంగా హింసించారని వివరించారు. వనితకు గతంలోనే అమ్మిరెడ్డి అనే వ్యక్తితో పెళ్ళైందని, ఆమెతో పాటు ఆమె తల్లి సైతం వ్యభిచారం చేసే వారనే విషయం వారి సొంతూరు వెళ్లినప్పుడు తెలిసిందని వెల్లడించారు. ఇలాంటి వారి వల్ల సమాజం చాలా ఇబ్బంది పడుతుందని, వనిత లాంటి వారిని వదలొద్దని పేర్కొన్నారు. తన తండ్రిని ఉద్దేశించి.. ‘డాడీ.. ఎవ్వరినీ విడిచిపెట్టొద్దు. నిద్ర పట్టడం లేదు.. అందరికీ శిక్ష పడేలా చూడు.. లవ్‌ యూ డాడీ.. కుందన (తన కుమార్తె) అలాంటి వాతావరణంలో పెరగడం ఇష్టం లేదు.. తీసుకుని రండి డాడీ.. ప్లీజ్‌ డాడీ..’అంటూ సెల్ఫీ వీడియోలో విజయ్‌ వేడుకున్నారు. చనిపోవడం కష్టంగా ఉన్నప్పటికీ తప్పట్లేదని, తన కుమార్తెను తల్లి దగ్గర నుంచి తీసుకురావాలని కోరారు.

శనివారమే భార్యపై పోలీసులకు ఫిర్యాదు..
కొన్నాళ్లుగా విడిగా ఉంటున్న భార్య వనితపై విజయ్‌సాయి శనివారం జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ రోజు రాత్రి 9.15 గంటలకు వనిత మరో నలుగురు గూండాలతో కలసి తన ఇంటికి వచ్చి.. తమ వాచ్‌మెన్‌ సీహెచ్‌ భీమన్నను వారు బెదిరించి తన కారు(ఏపీ09సీక్యూ6567)ను ఎత్తుకుపోయినట్లు ఆరోపించారు. తమ విడాకుల కేసు 2015 నుంచి కోర్టు పరిధిలో ఉందని, సదరు కారు తన భార్య పేరు మీదే ఉన్నప్పటికీ తానే ఖరీదు చేశారని వివరించారు. దాని ఫైనాన్స్‌కు సంబంధించిన వాయిదాలు సైతం తానే చెల్లించానని, అందుకు సంబంధించిన పూర్తి ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. వనితతో పాటు ఆమె వెంట వచ్చిన నలుగురి నుంచి ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించడంతో పాటు తన వాహనాన్ని తనకు ఇప్పించాలంటూ అభ్యర్థించారు. తన ఆరోపణలకు సా«క్ష్యాధారాలుగా కారుకు సంబంధించిన పత్రాలు, రసీదులతో పాటు తన ఇంటి వద్ద ఉన్న సీసీ కెమెరాల ఫీడ్‌ను అందిస్తున్నట్లు ఆ ఫిర్యాదులో విజయ్‌ పేర్కొన్నారు.

విజయ్‌ మృతిపై అనుమానాలున్నాయి..
విజయ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నా. సెల్ఫీలో అతడు చేసినవన్నీ నిరాధార ఆరోపణలు. అతడు నన్నెప్పుడూ మంచిగా చూడలేదు. దీనిపై గతంలోనూ కేసులు పెట్టా. అతడికి వేరే యువతితో వివాహేతర సంబంధం ఉంది. దాన్ని నేను స్వయంగా చూశా. దీంతో విడిపోవాలని నిర్ణయించుకుని అప్పటి నుంచి దూరంగా ఉంటున్నా. రెండేళ్ల క్రితం ఆ అమ్మాయిని వివాహం చేసుకుని ఆపై వదిలేశాడు. మా విడాకుల కేసు కోర్టులో నడుస్తోంది. గతంలో పిల్లలు వద్దంటూ నన్ను చిత్రహింసలకు గురి చేశాడు. మూడుసార్లు గర్భస్రావం చేయించాడు. ఏ నాడూ నేను బయటకు వచ్చి చెప్పుకోలేదు. అసలు ఆత్మహత్య చేసుకోవాల్సింది విజయ్‌ కాదు. గతంలో అతడి వేధింపులు తాళలేని నేనే చేసుకోవాల్సింది. విజయ్‌ వ్యవహారశైలిని అతడి తల్లిదండ్రులకు చాలాసార్లు చెప్పా. నేనెప్పుడూ అతడిని డబ్బు డిమాండ్‌ చేయలేదు. శశిధర్‌తో నాకు వివాహేతర సంబంధం ఉందనటం దారుణం. అతనెవరో నాకు తెలియదు. కోర్టు ఆదేశాల మేరకు విజయ్‌ పాపను తీసుకువెళ్లాడు. తిరిగి తెచ్చుకోవడానికే అతడి ఇంటికి వెళ్లాను. అప్పుడు మా మధ్య ఎలాంటి ఘర్షణా జరగలేదు. ఇప్పుడు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో తెలియదు. అతడికి, అతడి తండ్రికి మధ్య ఆస్తి వివాదాలు ఉన్నాయి. విజయ్‌ మృతిపై నాకూ అనుమానాలున్నాయి. అతడు చనిపోయేటంత పిరికివాడు కాదు. ఆస్తి తగాదాలే విజయ్‌ మరణానికి కారణమై ఉండొచ్చు. విజయ్‌ అంటే నాకు ప్రాణం.. అతడిని చంపుకునేంత పిచ్చిదాన్ని కాదు.    – మీడియాతో విజయ్‌ భార్య వనిత

మార్చురీకి వచ్చిన వనిత..
విజయ్‌సాయి మృతదేహాన్ని జూబ్లీహిల్స్‌ పోలీసులు ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. విషయం తెలుసుకున్న ఆయన భార్య వనిత తన కుమార్తెతో కలసి విజయ్‌ భౌతిక కాయాన్ని చూసి తిరిగి వెళ్లారు. అనేకమంది నటీనటులు సైతం ఉస్మానియా మార్చురీకి వచ్చారు. కాగా, విజయ్‌ మృతదేహానికి మంగళవారం ఉదయం పోస్టుమార్టం పరీక్షలు నిర్వహించనున్నారు. ఆపై యూసుఫ్‌గూడలోని నివాసానికి తరలిస్తారు. ఆయన అంత్యక్రియలు సిటీలోనే నిర్వహించనున్నట్లు కుటుంబీకులు తెలిపారు. కాగా, సెల్ఫీ వీడియో ఆధారంగా వనిత, శశిధర్, అడ్వొకేట్‌ శ్రీనులపై ఆత్మహత్యకు ప్రేరేపించడం కింద జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో వెలుగులోకి వచ్చే అంశాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

సెల్ఫీ వీడియో ఆధారంగా దర్యాప్తు చేయాలి..
చనిపోయిన వ్యక్తిపై ఆరోపణలు సరికాదు. కోర్టు కేసు సందర్భంలో చేయని ఆరోపణలు ఇప్పుడెందుకు చేస్తున్నారు. ఆర్థిక పరంగా మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. విజయ్‌కు నటన అంటే ప్రాణం. అందుకే ఒంగోలు నుంచి హైదరాబాద్‌కు వలస వచ్చాం. బంగారం, డబ్బు లాంటివి వనిత మా ఇంటి నుంచి మాకు తెలియకుండా తీసుకునేది. రాజీ కోసమంటూ వనిత తరఫు న్యాయవాది తరచు మా ఇంటికి వచ్చేవాడు. కేసు వంకతో డబ్బు డిమాండ్‌ చేసేవారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న సెల్ఫీ వీడియో ఆధారంగా దర్యాప్తు చేయాలి.   –విజయ్‌ తండ్రి సుబ్బారావు

సూసైడ్‌కు ముందు విజయ్ సెల్ఫీ వీడియో!



టాలీవుడ్‌లో మరో విషాదం 

Videos

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

ముస్లిం మహిళలతో కలిసి వైఎస్ భారతి ప్రార్థన

ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటే ఏంటో చెప్పి చంద్రబాబు కళ్ళు తెరిపించిన జగన్

జగన్ ను కదలనివ్వని జనాభిమానం @హిందుపూర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @పలమనేరు (చిత్తూరు జిల్లా)

వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి

ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సీఎం జగన్ సీరియస్

కూటమి పై సీఎం జగన్ అదిరిపోయే పంచులు..!

కేవలం ప్రజల ఆశీస్సులు కోసం పనిచేసే ఏకైక ప్రభుత్వం

మండుటెండను లెక్కచేయని అభిమానం...!

మండుటెండను లెక్కచేయని అభిమానం..!

విడుదల రజిని సమక్షంలో భారీ చేరికలు

ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి..!

హిందూపూర్ కి చేరుకున్న సీఎం జగన్ జనంతో కిక్కిరిసిన రోడ్లు

అంతా బాబే చేశారు

గొడుగు పట్టిన వాడి గుండెల్లో పొడిచిన బాబు

Photos

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)