amp pages | Sakshi

ఓటీటీ బాటలో మరో సినిమా

Published on Fri, 05/15/2020 - 10:26

కరోనా దెబ్బకు అతలాకుతలమైన రంగాల్లో సినీ పరిశ్రమ ఒకటి. లాక్‌డౌన్‌ ఎప్పడు ఎత్తేస్తారో తెలియదు.. ఒకవేళ ఎత్తేసినా ఇప్పట్లో థియేటర్లు తెరుచుకోవడం అసాధ్యం. ఈ నేపథ్యంలో కొత్త సినిమా షూటింగ్‌ల సంగతి తరువాత.. ప్రస్తుతం చిత్రీకరణ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ క్రమంలో అందరి దృష్టి ఓటీటీలపై పడింది. ఇప్పటకే పలు చిత్రాలు ఓటీటీల్లో విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో విద్యా బాలన్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘శకుంతలా దేవి: హ్యూమన్‌ కంప్యూటర్‌’  అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల కానుంది.(పెంగ్విన్‌ కూడా ఓటీటీ వైపే?)

ఈ విషయాన్ని విద్యా బాలన్‌ స్వయంగా ప్రకటించారు. ‘‘శకుంతలా దేవి: హ్యూమన్‌ కంప్యూటర్’ చిత్రాన్ని అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించడానికి సంతోషిస్తున్నాం. చాలా త్వరలోనే ఈ చిత్రం అమెజాన్‌ ప్రైమ్‌లో మీ ముందుకు రాబోతుంది’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించారు విద్యా బాలన్‌. అయితే సినిమా విడుదల తేదీని మాత్రం ప్రకటించలేదు. (గణిత ఘనాపాటి)

ప్రముఖ గణిత మేధావి శకుంతలా దేవి జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెకక్కిన సంగతి తెలిసిందే. శకుంతలా దేవి పాత్రలో విద్యా బాలన్‌ నటించారు. అయితే మే 8న విడుదల కావాల్సిన ఈ చిత్రం లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడింది. ఇప్పట్లో థియేటర్లు తెరుచుకునే పరిస్థితి లేకపోవడంతో ఈ చిత్రాన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదల చేయనున్నారు.(ఆడపులి)

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)