amp pages | Sakshi

విజయ్ ఖాతాలో మరో రికార్డ్‌..!

Published on Sat, 08/11/2018 - 15:52

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం కోలీవుడ్‌లో టాప్‌ ఫాంలో ఉన్న ఇళయ దళపతి తన సినిమాలతో వరుసగా వందల కోట్ల వసూళ్లు సాధిస్తున్నాడు. తాజాగా ఈ క్రేజీ హీరో మరో అరుదైన రికార్డ్‌ను సాధించేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం ఇండియన్‌ సినిమాలకు చైనా అతిపెద్ద మార్కెట్‌ గా తయారవుతున్న నేపథ్యంలో విజయ్‌ తన సినిమాను అక్కడ రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.

విజయ్‌ హీరోగా తెరకెక్కిన మెర్సల్‌ ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. ఎన్నో వివాదాల మధ్య ప్రేక్షకుల మందుకు వచ్చిన ఈ సినిమా ఘనవిజయం సాధించటంతో పాటు 120 కోట్లకుపైగా  షేర్‌ సాధించి విజయ్‌ మార్కెట్‌ స్టామినాను మరోసారి ప్రూవ్ చేసింది. ఇప్పుడు ఈ సినిమాను చైనాలో రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు మెర్సల్‌ యూనిట్‌.

ఇటీవలే ఇండియన్‌ సినిమాలో చైనా మార్కెట్‌లో సత్తా చాటుతున్నాయి. ఇప్పటి వరకు బాహుబలి తప్ప దంగల్‌, భజరంగీ భాయ్‌జాన్‌, సీక్రెట్ సూపర్‌ స్టార్‌, ప్యాడ్‌మేన్‌ లాంటి బాలీవుడ్‌ చిత్రాలు మాత్రమే చైనాలో రిలీజ్‌ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో చైనాలో రిలీజ్‌ అవుతున్న  తొలి తమిళ చిత్రంగా రికార్డ్ సృష్టించనుంది మెర్సల్‌. ఈ సినిమాను సల్మాన్‌ భజరంగీ భాయ్‌జాన్‌తో చైనాలో రిలీజ్ చేసిన డిస్ట్రిబ్యూషన్‌ సంస్థే రిలీజ్ చేస్తుండటంతో మెర్సల్‌ చైనా  రిలీజ్‌ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌