amp pages | Sakshi

నేను బైసెక్సువల్.. ఎవరితోనైనా ప్రేమలో

Published on Mon, 06/22/2020 - 09:54

సాక్షి, ముంబై: బాలీవుడ్‌ నిర్మాత, బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్‌ వికాస్‌​ గుప్తా తాను బైసెక్సువల్‌ అని సంచలన విషయాలు వెల్లడించారు. ‘హాయ్‌.. నా గురించి మీకు ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను ద్విలింగ సంపర్కుడిని. స్త్రీ, పురుష భేదం లేకుండా నేను ఎవరితోనైనా ప్రేమలో పడగలను. నాలాంటి వారు చాలామంది ఉన్నారు. నేను బైసెక్సువల్‌ అని చెప్పడానికి గర్వంగా ఫీలవుతున్నాను. ఇందులో ఎవరి బెదిరింపులు లేవు. నన్ను నేను గుర్తించేందుకు సాయం చేసిన ప్రియాంకశర్మ, పార్థ్‌సంథాన్‌లకు ధన్యవాదాలు’ అంటూ ట్వీట్‌ చేశారు. దీనితో పాటు తన ఫోటోలను కూడా షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ తెగ వైరలవుతోంది. నెటిజన్లు వికాస్‌ గుప్తా ధైర్యాన్ని మెచ్చుకుంటూ.. అతడికి మద్దతు తెలుపుతున్నారు. ‘వికాస్‌ గుప్తా వాస్తవాన్ని అంగీకరించారు.. అతడిని ఎవరు ఎగతాళి చేయకూడదు. మీలాంటి వారు చాలా అరుదు.. మీకు మా మద్దతు ఎప్పుడు ఉంటుంది’ అంటూ ప్రశంసిస్తున్నారు. 

‘దేవుడు నన్ను ఎలా సృష్టించాడో అలానే నేను అభివృద్ధి చెందాను. నా ప్రవర్తన పట్ల నా కుటుంబ సభ్యులు అవమానంగా భావించారు. నా తల్లి కూడా నన్ను ద్వేషించింది. నా తోబుట్టువులు నన్ను అసహ్యించుకున్నారు. వారు నన్ను చూసి అవమానంగా ఫీలయ్యేవారు. కానీ నేను వారిని ప్రేమిస్తున్నాను. వారిని గర్వంగా తలెత్తుకునేలా చేస్తాను. పార్థ్‌సంతాన్, ప్రియాంక శర్మలకు ధన్యవాదాలు. వారు నాకు చేసిన అవమానాల వల్ల నేను మరింత శక్తివంతంగా తయారయ్యాను. నా గురించి వాస్తవాలు వెల్లడించగలిగాను. దీనిపై వారు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. నాకు మద్దతుగా నిలిచిన నా స్నేహితులకు ధన్యవాదాలు’ అన్నారు వికాస్‌ గుప్తా.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌