amp pages | Sakshi

మందు కోసం న‌టుడి ముందుచూపు!

Published on Wed, 06/10/2020 - 18:05

మందు బాటిల్ తెచ్చుకునేందుకు ఖాళీ చేతుల‌తో వెళ‌తారు. లేదంటే ఓ సంచి ప‌ట్టుకుని వెళ్తారు. కానీ బాలీవుడ్ న‌టుడు శ‌క్తి క‌పూర్ మాత్రం పెద్ద డ్ర‌మ్ములాంటిదే త‌లకెత్తుకున్నాడు. ఇంత‌కీ ఎందుకో చ‌దివేసేయండి. లాక్‌డౌన్ వ‌ల్ల అంద‌రి మ‌న‌సులోనూ గూడుక‌ట్టుకున్న క‌రోనా భ‌యాన్ని కాస్త తొల‌గించి అభిమానుల‌ను కాసేపు హాయిగా న‌వ్వించేందుకు ప్ర‌య‌త్నించాడు న‌టుడు శ‌క్తి క‌పూర్‌. అందులో భాగంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను షేర్ చేశాడు. ఇందులో అత‌డు ఓ డ్ర‌మ్ము సైజులో ఉన్న చెత్త బుట్ట‌ను త‌ల‌పై ఎత్తుకుని బాహుబ‌లిలా ప్ర‌భాస్‌లా ఒక్కో అడుగు ముందుకేస్తూ గేటు వైపు న‌డిచాడు. (ఇంట గెలిచి రచ్చ గెలిచింది)

ఇంత‌లో ఓ వ్య‌క్తి 'హ‌లో భాయ్‌..  ఎక్క‌డికి వెళుతున్నారు?' అని అడ‌గ్గా.. శ‌క్తి కపూర్ 'మందు కోసం' అని సమాధానమిచ్చాడు. దీంతో అత‌ను ఆ సొసైటీ(అపార్ట్‌మెంట్ వాసులు)కోసం కూడా తీస్కురా అంటూ జోకు పేల్చాడు. ఈ ఫ‌న్నీ వీడియో ప్ర‌స్తుతం తెగ‌ వైర‌ల్ అవుతోంది. కాగా శ‌క్తి క‌పూర్ ఇప్ప‌టివ‌ర‌కు 700 సినిమాల్లో న‌టించాడు. బిగ్‌బాస్ 5వ సీజ‌న్‌లోనూ నటించాడు. అతడి భార్య‌ శివంగి కొల్లాపూర్. వీరిద్ద‌రికీ సిద్ధాంత్, శ్ర‌ద్ధా క‌పూర్ సంతానం. వీరిద్ద‌రూ సినీ ప‌రిశ్ర‌మ‌లో ఎంట్రీ ఇచ్చి త‌మ ప్ర‌తిభ చాటుకుంటున్నారు. (నీ అలవాటు గురించి నీకు తెలుసా.. సారీ!)

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)