amp pages | Sakshi

ఆ 11 మంది బాలికలు హత్యకు గురయ్యారు..!

Published on Sat, 05/04/2019 - 11:53

న్యూఢిల్లీ: ముజఫర్‌పూర్‌ షెల్టర్‌ హోమ్‌ ఘటనలో జాడ తెలియని 11 మంది బాలికలు హత్యకు గురై ఉండొచ్చునని సీజీఐ అత్యున్నత న్యాయస్థానానికి తెలిపింది. ఈ కేసులో ప్రధాన నిందితుడున బ్రజేష్‌ ఠాకూర్‌, అతని అనుచరులు వారిని దారుణంగా హత్య చేసి పాతిపెట్టారని శుక్రవారం  కోర్టుకు నివేదించింది. షెల్టర్‌ హోమ్‌ సమీపంలో గల శ్మశానం నుంచి బాలికల ఎముకల అవశేషాలను సేకరించామని పేర్కొంది. హత్యకు గురైన చిన్నారుల పేర్లు కూడా వెలుగులోకి వచ్చినట్లు సీబీఐ తన అఫిడవిట్‌లో వివరించింది. ఇక గతేడాది మే నెలలో బయటపడిన ముజరాఫర్‌ షెల్టర్‌ హోమ్‌ ఘటనలో 40 మంది బాలికలు అత్యాచారాలకు గురై చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారని టాటా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ నివేదిక బయటపెట్టిన సంగతి తెలిసిందే.

వసతి గృహంలో తలదాచుకుంటున్న అనాథ బాలికల పట్ల అఘాయిత్యాలు వెలుగు చూడడంతో సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. షెల్టర్‌ హోంల నిర్వహణ పట్ల బిహార్‌ ప్రభుత్వం తీరును సుప్రీం కోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. ముజఫర్‌పూర్‌ షెల్టర్‌ హోంలో బాలికలపై లైంగిక వేధింపుల కేసును ఢిల్లీ కోర్టుకు బదలాయించాలని గత ఫిబ్రబరిలో ఆదేశించింది. షెల్టర్‌ హోం కేసులన్నింటినీ బిహార్‌ సీబీఐ కోర్టు నుంచి ఢిల్లీలోని పోక్సో సాకేత్‌ ట్రయల్‌ కోర్టుకు రెండు వారాల్లోగా తరలించాలని స్పష్టం చేసింది. ​​​​బ్రజేష్‌ ఠాకూర్‌ అనే వ్యక్తి నడుపుతున్న ఎన్జీవో ఆధ్వర్యంలోని వసతి గృహంలో ఈ దారుణాలు చోటుచేసుకున్నాయి. ఈ కేసులో ఠాకూర్‌తో పాటు మరో 21 మందిపై సీబీఐ చార్జిషీటు దాఖలు చేసి విచారణ చేస్తోంది. కామాంధుల కీచకపర్వంలో సమిధలైన చిన్నారులంతా 7-14 ఏళ్లలోపు వారే కావడం దారుణం.

(చదవండి : షెల్టర్‌ హోం కేసు: ఢిల్లీ కోర్టుకు బదలాయించిన సుప్రీం)

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)