amp pages | Sakshi

12 పసిప్రాణాలు బలి

Published on Fri, 01/20/2017 - 03:10

ఉత్తరప్రదేశ్‌లో లారీ, బస్సు ఢీ
పొగమంచు, అతివేగం వల్లే..

ఎటా(ఉత్తరప్రదేశ్‌): ప్రతీరోజు లాగే ఆరోజు కూడా స్కూలు బస్సెక్కారు పిల్లలు. కానీ పాఠశాలకు చేరాల్సిన వారి గమ్యస్థానం ఆసుపత్రులకు, మార్చురీలకు చేరింది. ఎంతో సున్నితమైన చిన్నారుల శరీరాలు బస్సులో ఛిద్రమైపోయాయి. పాఠశాలలో ఆటపాటలతో కేరింతలు కొట్టాల్సిన వారు, భయంతో ఆర్తనాదాలు చేయాల్సి వచ్చింది. పొగమంచు, అతి వేగం, యాజమాన్య నిర్లక్ష్యం కలసి 12 మంది విద్యార్థుల ప్రాణాలను బలి తీసుకున్నాయి. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఎటా జిల్లాలోని అలీగంజ్‌–పాలియాలి రహదారిపై గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 13 మంది మృతి చెందగా.. 20 మంది విద్యార్థులు గాయపడ్డారు.

మృతుల్లో 12 మంది బాలలు, బస్సు డ్రైవర్‌ ఉన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చలి అత్యధికంగా ఉండటంతో పాఠశాలలకు సెలవివ్వాలన్న జిల్లా మేజిస్ట్రేట్‌ ఉత్తర్వులను ధిక్కరిస్తూ స్థానిక జేఎస్‌ విద్యానికేతన్  తరగతులు నిర్వహిస్తోంది. ఈ పాఠశాలకు చెందిన బస్సు 66 మంది చిన్నారులతో వెళు్తండగా ఎదురుగా వస్తున్న లారీ ఢీకొంది. ఈ ఘటన కు పొగమంచు, అతి వేగమే కారణమని అధికారులు చెబుతున్నారు. మరణించిన విద్యార్థులంతా 5–15 ఏళ్ల విద్యార్థులు కావడంతో ఘటనా స్థలంలో, ఆస్పత్రిలో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ‘ఈ ఘటన తెలిసిన వెంటనే ఎంతో ఆవేదన చెందాను. చనిపోయి న బాలల కుటుంబాల బాధను నేనూ పంచుకుంటున్నాను. మృతి చెందిన చిన్నారులకు నివాళులు’ అని ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)