amp pages | Sakshi

లాక్‌డౌన్‌లో రక్తమోడుతున్న రోడ్లు

Published on Sun, 05/17/2020 - 08:39

న్యూఢిల్లీ : దేశంలో కరోనా వ్యాప్తిని అరికట్టే లక్ష్యంతో కేంద్రం లాక్‌డౌన్‌ విధించిన సమయంలో మార్చి 25 నుంచి మే 16వ తేదీ వరకు 2 వేల రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకోగా 368 మంది మృతి చెందినట్లు తేలింది. దేశంలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు కృషి చేస్తున్న సేవ్‌లైఫ్‌ ఫౌండేషన్‌ సంస్థ ఇందుకు సంబంధించిన గణాంకాలను విడుదల చేసింది. మొత్తం 368 మంది మృతుల్లో సొంతూళ్లకు వెళ్తున్న వలస కార్మికులు 139 మంది కాగా, అత్యవసర సేవల సిబ్బంది 27 మంది, ఇతరులు 202 మంది అని వెల్లడించింది. ‘368 మంది మృతుల్లో ఒక్క యూపీలోనే 100 మంది ఉన్నారు. (చితికిన బతుకులు)

తర్వాతి స్థానాల్లో మధ్యప్రదేశ్‌(30), తెలంగాణ (22), మహారాష్ట్ర(19), పంజాబ్‌(17) ఉన్నాయి. ఈ ప్రమాదాలన్నిటికీ అతి వేగమే కారణమని సేవ్‌ లైఫ్‌ ఫౌండేషన్‌ సీఈవో పీయూష్‌ తివారీ తెలిపారు.లాక్‌డౌన్‌ కారణంగా రోడ్లపై ట్రాఫిక్‌ చాలా తక్కువగా ఉండటం.. చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితుల్లో స్వస్థలాలకు వెళ్లాలన్న ఆత్రుత వంటి కారణాలతో వాహనాలను వేగంగా నడుపుతున్నారు. దీంతోపాటు చాలా వరకు ప్రమాదాలు రాత్రి వేళల్లో, వలస జీవులు నడిచి వెళ్తుండగా లేదా నిద్రిస్తుండగా జరిగినవే’అని తెలిపారు. దేశంలో ఏటా సంభవించే 5 లక్షలకుపైగా రోడ్డు ప్రమాదాల్లో 1.50 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నట్లు అంచనా. (కరోనా మరణాలు 2,752)

Videos

విశాఖ నుంచే ప్రమాణస్వీకారం చేస్తా

వీళ్లే మన అభ్యర్థులు.. ఈసారి ఢిల్లీ పీఠం కదలాలి

ఇచ్ఛాపురం బహిరంగ సభలో సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్

చంద్రబాబు చేసిన మోసాలు లైవ్ లో వినిపించిన సీఎం జగన్

బాబును చీల్చి చెండాడిన మహిళలు

ఓటు తో కొట్టే దెబ్బకు ఢిల్లీ పీఠం కదలాలి..

సీఎం జగన్ ప్రభుత్వంలో ఉత్తరాంధ్రకు చేసిన అభివృద్ధి ఇదే

మీ జగన్ మార్క్ పథకాలు ఇవి...!

నీ ముగ్గురు భార్యలను పరిచయం చెయ్యు పవన్ కళ్యాణ్ ను ఏకిపారేసిన ముద్రగడ

టీడీపీ వాళ్ళు నన్ను డైరెక్ట్ ఎదుర్కోలేక: RK రోజా

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?