amp pages | Sakshi

ఆమ్‌ ఆద్మీ అందగాడు గెలిచేశాడు..!

Published on Tue, 02/11/2020 - 20:46

సాక్షి, న్యూఢిల్లీ: ఎలాంటి గందరగోళం, ఉత్కంఠ లేదు. వార్‌ వన్ సైడ్‌ అయింది. ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలను మించిన ఫలితాలతో సామాన్యుడి ఆమ్‌ ఆద్మీ అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. ఢిల్లీలోని మొత్తం70 అసెంబ్లీ స్థానాల్లో ఆప్‌ 62 చోట్ల గెలుపొందగా.. బీజేపీ 8 స్థానాలతోనే సరిపెట్టుకుంది. కాగా.. ఆప్ పార్టీకి చెందిన రాఘవ్ చద్దా భారీ మెజార్టీతో గెలుపొందారు. రాజేందర్ నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన రాఘవ్.. బీజేపీ అభ్యర్థి ఆర్పీ సింగ్‌పై 20వేల 58ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 

(హస్తిన తీర్పు : ఆప్‌ 62.. బీజేపీ 8)

ఎన్నికల ప్రచారం సమయంలో రాఘవ్ చద్దాకు వింత అనుభవాలు ఎదురైన సంగతి తెల్సిందే. ఎన్నికల ప్రచారం సమయంలో ఓటర్ల నుంచి నియోజకవర్గ సమస్యల గురించి వినతులు వస్తుంటాయి. కానీ, రాఘవ్ చద్దాకు మాత్రం పెళ్లి ప్రపోజల్స్ వచ్చాయి. ఆయన ప్రచారంలో పాల్గొన్న సమయంలో..'మీరు చాలా బాగున్నారు. మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని ఓ మహిళా ఫాలోవర్‌ చద్దాకు ప్రపోజ్‌ చేయగా, ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ బాగాలేనందున పెళ్లి చేసుకునేందుకు ఇది సరైన సమయం కాదని చద్దా తెలివిగా బదులిచ్చిన విషయం తెలిసిందే. ప్రచారంలో భాగంగా ఆయన ఓ స్కూల్‌కు వెళ్లగా అక్కడున్న టీచర్‌ ఒకరు తనకు కుమార్తె ఉంటే మీకిచ్చి వివాహం చేసేదాన్నని చద్దాతో చెప్పుకొచ్చారని ఆయన సోషల్‌ మీడియా బృందం పేర్కొంది.  (ఓటు కోసం వెళితే పెళ్లి ప్రపోజల్స్‌..)

ఇక ‘మీకు పెళ్లి ప్రపోజల్స్‌ వస్తున్నా మీరు పెళ్లి మాత్రం చేసుకోవద్దని అలా చేస్తే తన గుండె ముక్కలవుతుంద’ని ఓ మహిళ ఆప్‌ నేత ఇన్‌స్టాగ్రాంలో ఆయనను వేడుకున్నారు. ట్విటర్‌లో మరో మహిళ చద్దాను ఉద్దేశించి మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ ఎరౌండ్‌ అంటూ ఓ స్టోరీని షేర్‌ చేశారు. సీఏగా కెరీర్ ప్రారంభించిన రాఘవ్ చద్దా తరువాత రాజకీయాలోకి ప్రవేశించారు. తదనంతరం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ పార్టీలో చేరారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో సౌత్ ఢిల్లీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలో అతను గెలుపొందడంతో, ఇదంతా ఆ అమ్మాయిల వల్లే అంటూ కొందరు చమత్కరిస్తున్నారు.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)