amp pages | Sakshi

మెట్రో ప్రారంభోత్సవం.. కేజ్రీవాల్‌కేదీ ఆహ్వానం?

Published on Sat, 12/23/2017 - 18:56

న్యూ ఢిల్లీ: నొయిడా బొటానికల్‌ గార్డెన్‌ నుంచి ఢిల్లీలోని కల్కాజీ వరకు నిర్మించిన మెట్రోరైలు ప్రారంభోత్సవానికి హస్తిన ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఆహ్వానం అందకపోవడం రాజకీయంగా విమర్శలకు తావిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ చేతుల మీదుగా ఈ మెట్రోలైన్‌ ఈ నెల 25న ప్రారంభం కానుంది. యూపీ పరిధిలోకి వచ్చే నొయిడాలోని బొటానికల్‌ గార్డెన్‌ వద్ద ఈ ప్రారంభోత్సవ వేడక జరుగుతుంది. దేశ రాజధాని ప్రాంతంలో ఇది మొదటి ఇంటర్‌చేంజ్‌ స్టేషన్‌ కావడం గమనార్హం.  

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం వీఐపీ అతిథుల జాబితాలో అరవింద్‌ కేజ్రీవాల్‌ పేరు లేదు. 12.64 కిలోమీటర్ల పొడవున్న ఈ మెట్రోలైన్‌ ఢిల్లీలో ముగుస్తుంది. ఢిల్లీ మెట్రో కార్పొరేషన్‌ (డీఎంఆర్సీ) హస్తిన, కేంద్ర ప్రభుత్వాల (కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ) జాయింట్‌ వెంచర్‌ (ఇరు వర్గాలకు 50:50 వాటా ఉంది). నొయిడా నుంచి మెట్రోలైన్‌కు యూపీ ప్రభుత్వమే నిధులు సమకూర్చినప్పటికీ, ఢిల్లీలో పొడిగించిన మేర దూరానికి ఆ రాష్ట్ర ప్రభుత్వమే నిధులు భరించింది. ఈ నేపథ్యంలో సీఎం కేజ్రీవాల్‌కు ఆహ్వానం అందకపోవడం విమర్శలకు తావిస్తోంది.

ఆహ్వానం అందని విషయాన్ని ఢిల్లీ ప్రభుత్వ అధికార ప్రతినిధి సైతం ధ్రువీకరించారు. ఆయన మాట్లాడుతూ ఢిల్లీ మెట్రో రైలు కార్పోరేషన్‌(డీఎంఆర్‌సీ) నుంచి అధికారికంగా ఎలాంటి పిలుపు రాలేదని తెలిపారు.  తక్కువ ధరలతో మెట్రో ప్రయాణం సురక్షితంగా సాగలన్నదే తమ లక్ష్యమని అన్నారు. మెట్రో నిర్మాణ సంస్థలు ధరల పెంపును ప్రతిపాదించినప్పుడు ప్రభుత్వం అంగీకరించలేదని వెల్లడించారు. కానీ ఢిల్లీ మెట్రో సంస్థ, కేంద్ర ప్రభుత్వంతో కలిసి ధరల పెంపు నిర్ణయాన్ని తీసుకుందని పేర్కొన్నారు. తమకు ఆహ్వానం అందకపోవడంపై ఎమైనా ప్రశ్నలు అడగదలుచుకుంటే పట్టణాభివృద్ధి శాఖను, డీఎంఆర్‌సీని సంప్రదించాలని తెలిపారు.

బొటానికల్‌ గార్డెన్‌ నుంచి కల్కాజీ వరకు పారంభం కానున్న మార్గంలో తొమ్మిది స్టేషన్‌లున్నాయి. దీని ద్వారా ఈ మార్గంలో ప్రయాణ సమయం 52 నిమిషాల నుంచి 19 నిమిషాలకు తగ్గనుంది. అధునాతన టెక్నాలజీతో డ్రైవర్‌ లేకుండా రైలు పరుగులు పెట్టనుంది. ఇది ఈ ఏడాదిలో ప్రధాని మోదీ ప్రాంభించనున్న మూడో మెట్రోరైలు కావడం విశేషం. జూన్‌లో కొచ్చి మెట్రోను, నవంబర్‌లో హైదరాబాద్‌ మెట్రోను మోదీ ప్రారంభించారు.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)