amp pages | Sakshi

బొయిపరిగుడ కళాశాలలో విద్యార్థిపై  దాడి

Published on Tue, 07/31/2018 - 14:22

జయపురం : కొరాపుట్‌ జిల్లా సయపుర సబ్‌డివిజన్‌ పరిధి బొయిపరిగుడ గ్రామంలో గల కళాశాలలో సోమవారం ఊహించని సంఘటన జరిగింది. ఈ సంఘటనలో ఒక విద్యార్థి తోటి విద్యార్థిపై కత్తితో దాడి చేయడంతో కళాశాలలో భయానక వాతావరణం  నెలకొంది. తీవ్రంగా  గాయపడిన విద్యార్థిని మొదట జయపురం ప్రభుత్వ సబ్‌డివిజన్‌ హాస్పిటల్‌కు తరలించారు. విద్యార్థి  పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు వెంటనే కొరాపుట్‌ సహిద్‌ లక్ష్మణ్‌ నాయక్‌ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు.

వివరాలిలా ఉన్నాయి. జయపురం సమితిలోని అంబాగుడ గ్రామానికి చెందిన విద్యార్థులు జయరాం డాలి, విజయ ఖొశ్లాలు బొయిపరిగుడ కళాశాలలో  +2 చదువుతున్నారు. సోమవారం ఈ ఇద్దరు కలిసి  ఒక సైకిల్‌పై కళాశాలకు వెళ్లారు. ఆ సమయంలో వారి మధ్య  ఏదో విషయంపై వివాదం రేగింది. దీంతో కోపోద్రిక్తుడైన వియజ ఖొర కోపంతో జయరాం తలపై ఒక మారణాయుధంతో బాదాడు. ఈ సంఘటనతో కళాశాలలో భయాందోళన చోటుచేసుకుంది.

కళాశాల  బయట జరిగిన ఈ సంఘటనపై కళాశాల అధికారులు పోలీసులకు తెలుపగా బొయిపరిగుడ పోలీసులు వచ్చి గాయపడిన జయరాం ను వెంటనే జయపురం ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడినుంచి కొరాపుట్‌ ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనపై బొయిపరిగుడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మిత్రులైన ఆ విద్యార్థుల మధ్య ఏం జరిగింది? వారి మధ్య ఎందుకు వివాదం ఏర్పడిందన్నది కళాశాల విద్యార్థుల మధ్య తీవ్ర చర్చనీయంశమైంది.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)