amp pages | Sakshi

బెల్గాం మనదే..

Published on Mon, 09/15/2014 - 02:27

ముఖ్యమంత్రి సిద్ధరామయ్య
 
సాక్షి, బెంగళూరు/మైసూరు : కర్ణాటకలో బెల్గాం అంతర్భాగమేనని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. మహాజన్ నివేదికను అనుసరించి బెల్గాం ఎప్పటికీ కర్ణాటకలోనే ఉంటుందన్నారు. మైసూరులో స్థానిక మీడియా ప్రతినిధులతో ఆయన ఆదివారం మాట్లాడారు. ఈ విషయంలో మహారాష్ట్ర అనవసర రాద్ధాంతం చేస్తోందని అసహనం వ్యక్తం చేశారు.
 
ఉత్తర కర్ణాటక ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా విభజించాలని మాజీ మంత్రి ఉమేష్‌కత్తి పేర్కొనడాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తప్పుపట్టారు. అఖండ కర్ణాటక ప్రతి ఒక్క కన్నడిగుడి కల అని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కర్ణాటకను విభజించే ప్రసక్తే లేదన్నారు. స్థానిక సంస్థలతోపాటు వివిధ బోర్డులు, కార్పొరేషన్లలో 50 శాతం పోస్టులు మహిళలకు కేటాయించాలనేది తనతోపాటు తమ పార్టీ అభిమతమన్నారు. ఈ విషయంలో గవర్నర్ వజూభాయ్ రుడాభాయ్ వాలా సలహా తీసుకుంటామని చెప్పారు. నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయమై నేడు (సోమవారం) బెంగళూరులో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు.
 
ఇందులో కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పరమేశ్వర్ కూడా పాల్గొననున్నారని తెలిపారు.  పరమేశ్వర్‌కు ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వకూడదని తాను పార్టీ హై కమాండ్‌కు లేఖ రాశానన్నది ఆధార రహితమని అసహనం వ్యక్తం చేశారు. ఉత్తరకర్ణాటక ప్రాంతంలో ఏర్పడిన అతివృష్టి వల్ల నష్టపోయిన రైతులను, ప్రజలను ఆదుకునేందుకు రూ.426 కోట్ల పరిహారాన్ని అందించాల్సిందిగా కేంద్రానికి లేఖ రాశానన్నారు. కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో ఏర్పడిన కరువు పరిస్థితులపై కేంద్రానికి మరో నివేదిక పంపించనున్నట్లు చెప్పారు. దసరా ఉత్సవాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ జోక్యం చేసుకోబోదన్నారు. ఈ విషయంలో మైసూరు జిల్లా అధికారులతోపాటు ఉత్సవాల నిర్వహణ కోసం ఏర్పాటుచేసిన ప్రత్యేక కమిటీదే అంతిమ నిర్ణయమని సిద్ధరామయ్య పేర్కొన్నారు.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)