amp pages | Sakshi

క్యాస్ట్‌కు మూల అర్థం రక్తమా?

Published on Fri, 06/29/2018 - 17:20

సాక్షి, న్యూఢిల్లీ : నేటి ఆధునిక సమాజంలో కులానికున్న ప్రాధాన్యత తక్కువేమి కాదు. రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా కులాల ప్రస్థావన లేకుండా ప్రభుత్వ పాలనే లేదు. ఇంతకూ కులం అంటే ఏమిటీ? ఎక్కడి నుంచి వచ్చింది. ఎలా పుట్టింది?. కులానికి సమానమైన అర్థం ఉందా?. సంస్కతంలో ‘జాతి’ , అరబిక్‌లో ‘కామ్‌’, పర్షియన్‌లో ‘జాట్‌’ అనే పదాలున్నాయి. ఇవన్నీ కూడా ‘క్యాస్ట్‌ (కులం)’అనే పదానికి సమానమైన అర్థాన్ని ఇవ్వడం లేదు. క్యాస్ట్‌ అనే ఇంగ్లీషు పదం ‘క్యాస్ట’ అనే స్పానిష్‌ మాతృక నుంచి వచ్చింది. ‘క్యాస్ట’ అన్న పదం తొలుత ఐబీరియన్లు అయిన స్పానిష్, పోర్చుగీసులు ఉపయోగించారు. ఈ పదాన్ని అమెరికాకు స్పానిష్‌లు, ఆసియాకు పోర్చుగీసులు పరిచయం చేశారు.  ‘ఎసో మీ వియెని డి క్యాస్ట’... ‘క్యాస్ట డి జుడియోస్‌’ పదాలు ఆ విషయాన్ని సూచిస్తున్నాయి.
 
‘ఎసో మీ వియెని డి క్యాస్ట‌’ అనే స్పానిష్‌ వ్యాక్యానికి తెలుగులో ‘ఇది నా రక్తం’ అని అర్థం. ఎవరి కులం ఏదైనా అందరిలో ప్రవహించేది ఒకే రక్తం అంటాం. అదే రక్తం అనే పదం నుంచి క్యాస్ట్‌ అనే పదం వచ్చిందంటే ఆశ్చర్యమే! యూదులను వేరు చేసి వారిని అవమానించడం కోసం ఐబీరియన్లు ‘క్యాస్ట డి జుడియోస్‌’ అంటే ‘వారు యూదులు’ అనే పదాన్ని ముందుగా తీసుకొచ్చారట. ఈ క్యాస్ట్‌ అనే పదం భారత దేశానికి పరిచయం కాకముందే ఒకే ఆదిమ జాతి లేదా గణం మధ్య తప్ప మిగతా జాతి లేదా గణాల మధ్య పెళ్లిళ్లు చేసుకునే వ్యవస్థ లేదు. భారత్‌లోని హిందువులు, జైనులు, బౌద్ధులు, ముస్లింలు, సిక్కులు, క్రైస్తవ మతస్తులందరిలోనూ ‘క్యాస్ట్‌ సిస్టమ్‌’ ఉంది.

ఒకప్పుడు జైనులు, బౌద్ధులు, సిక్కులను హిందువులుగానే పరిగణించేవారు. ఇప్పుడు జైనులు, బౌద్ధులను వేరు మతస్థులుగాను, సిక్కులను హిందువుల్లో భాగంగాను పరిగణిస్తున్నారు. బ్రిటిషర్లు మొట్టమొదటి సారిగా ముంబైలో తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు కూడా కులాల ప్రాతిపదికనే పదవులను నిర్ణయించారు. వ్యవసాయదారులు, వ్యవసాయేతరుల మధ్య భూముల లావాదేవీలకు సంబంధించి 1900 సంవత్సరంలో బ్రిటిష్‌ పాలకులు ‘ల్యాండ్‌ ఎలియనేషన్‌ యాక్ట్‌’ను తీసుకొచ్చినప్పుడు కూడా అందులో తెగలు, కులాల ప్రస్థావన తీసుకొచ్చారు. (కుల వ్యవస్థ గురించి పూర్తి అవగాహన కలగాలంటే సుమిత్‌ గుహ రాసిన ‘బియాండ్‌ క్యాస్ట్‌’ రివైజ్డ్‌ వెర్షన్‌ పుస్తకాన్ని చదవాల్సిందే. సుమిత్‌ టెక్సాస్‌ యూనివర్సిటీలో హిస్టరీ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు).

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)