amp pages | Sakshi

వీరు ధీర వనితలు.....

Published on Fri, 02/26/2016 - 19:11

న్యూఢిల్లీ: ‘ఎన్ని రకాల భయాందోళనలు చుట్టుముట్టినా విజయమే అంతమ లక్ష్యం కావాలి. విజయం ఎంత దూరమైనా, మార్గం ఎంత కఠినమైనా సాధించాల్సిందే. విజయం లేకుండా మనుగడ లేదు’ అని విన్స్‌టన్ చర్చిల్ చెప్పినట్లుగా ఈ ధీర వనితలు ఎన్ని కఠిన పరిస్థితులు ఎదురైనా విజయం వైపే దూసుకుపోయారు. యాసిడ్ దాడులకు ముఖాలు అష్టవక్రంగా మారిపోయినా కుమిలిపోకుండా, తమ ముఖాలు చూడాలంటేనే దడుసుకునే ప్రజల మధ్యలోనే మనుగడ సాగిస్తూ తమ లక్ష్యాలను సాధిస్తున్నారు.

లక్ష్మీ.....ఢిల్లీలో చదువుతున్న ఆమెకు 2005లో 16 ఏళ్లు. 32 ఏళ్ల యువకుడు వచ్చి ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. కాదు పొమ్మన్నందుకు యాసిడ్ దాడి జరిపాడు. ముఖం, చేతులు కాలిపోయాయి. అందం కాస్త కురూపిగా మారింది. కోలుకున్నాక ఏనాడు కుమిలి పోలేదు. నేడు ఓ పిల్లకు తల్లేకాదు, తనలాంటి మహిళ హక్కుల కోసం పోరాడుతున్న ధీర వనిత. కేవలం యాసిడ్ దాడుల బాధితుల కోసమే ఏర్పాటైన ఛాన్వ్ ఫౌండేషన్‌కు ఆమె ఇప్పుడు డైరెక్టర్. ఆమె దాఖలు చేసిన పిటిషన్ కారణంగానే యాసిడ్ అమ్మకాలను నియంత్రించాల్సిందిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీం కోర్టు ఆదేశించింది. 2014లో మిషెల్ ఒబామా చేతుల మీదుగా అంతర్జాతీయ ధీర వనిత అవార్డును కూడా అందుకున్నారు. యాసిడ్ దాడి బాధితుల అందాల పోటీల్లో కూడా ఆమె పాల్గొన్నారు.

రూప......ఉత్తరప్రదేశ్‌లోని ముజాఫర్‌నగర్‌కు సమీపంలోని గ్రామానికి చెందినరూప ముఖంపై 2008లో ఆమె సవతి తల్లి యాసిడ్ పోసింది. కట్నం ఇచ్చి పెళ్లి చేయాల్సి వస్తుందని, కురీపి అయితే పెళ్లి పెటాకులు లేకుండా ఇంట్లో పడి ఉంటుందని భావించిన ఆమె సవతి తల్లి రూప నిద్రపోయినప్పుడు ఈ దారుణానికి ఒడి గట్టింది. తండ్రి కూడా చేరదీయలేదు. ఇంటినీ, ఇంటి పేరును కూడా వదిలేశారు. ఆమె ఇప్పుడు ఆగ్రాలో తోటి నలుగురు యాసిడ్ బాధితులతో కలసి బోటిక్ నడుపుతున్నారు.

 మోనిక.....ఢిల్లీలోని ‘నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫాషన్ టెక్నాలజీ’లో చదువుతున్నప్పుడు ఆమెకు 20 ఏళ్లు. మోడల్ కావాలనుకున్నారు. లక్నోలో ఉంటున్న తన తల్లిదండ్రులను చూసేందుకు అక్కడికి వెళ్లినప్పుడు ఓ యువకుడు ప్రేమిస్తున్నానని ఆమె వెంటబడ్డాడు. కాదన్నందుకు యాసిడ్ దాడి చేశాడు. అనేక సర్జరీల అనంతరం ఆమె ఇప్పుడు న్యూయార్క్‌లోని ‘స్కూల్ ఆఫ్ డిజైన్’లో చదువుకుంటున్నారు. ఇలా యాసిడ్ దాడులకు గురైన ఎంతోమంది ధైర్యం, మానసికస్థైర్యంతో తమలాంటి వారికి స్ఫూర్తినిస్తున్నారు.

Videos

చంద్రబాబుకు దమ్ముంటే మోడీతో 4% రిజర్వేషన్ రద్దు చేయను అని చెప్పించే దమ్ము ఉందా?

స్పీచ్ మధ్యలో ఆపేసిన సీఎం జగన్ ఎందుకో తెలుసా...?

మరో 3 రోజులో బ్యాలెట్ బద్దలు కొట్టడానికి సిద్ధమా

రామోజీ రావుకు బొత్స సత్యనారాయణ స్ట్రాంగ్ కౌంటర్

మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పింది మీ బిడ్డే

ఉప్పోగిన ప్రజాభిమానం కిక్కిరిసిన కడప

సీఎం జగన్ ఎంట్రీతో దద్దరిల్లిన కడప

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కడప (వైఎస్ఆర్ కడప జిల్లా)

ఏపీకి మళ్లీ జగనే సీఎం: KCR

పచ్చ మందపై విరుచుకుపడ్డ సీఎం జగన్ దద్దరిల్లిన నగరి...

Photos

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

హీరోయిన్‌తో స్టార్‌ క్రికెటర్‌ డ్యాన్స్‌.. నువ్వు ఆల్‌రౌండరయ్యా సామీ! (ఫోటోలు)

+5

సన్‌రైజర్స్‌ పరుగుల సునామీ.. కావ్యా మారన్‌ రియాక్షన్‌ వైరల్‌ (ఫొటోలు)

+5

రాయ్‌ లక్ష్మీ బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. కళ్లలో టన్నుల కొద్దీ సంతోషం (ఫోటోలు)

+5

కల్యాణదుర్గంలో జనహోరు (ఫొటోలు)

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)