amp pages | Sakshi

ఇస్రో మాజీ చైర్మన్‌పై చార్జ్‌షీట్

Published on Fri, 08/12/2016 - 01:31

‘యాంత్రిక్స్-దేవాస్’ కేసులో నాయర్‌తో పాటు పలువురి పేర్లు
కేబినెట్‌తో పాటు అంతరిక్ష కమిషన్‌ను మోసగించారన్న సీబీఐ

న్యూఢిల్లీ: యాంత్రిక్స్-దేవాస్ ఒప్పందం కేసులో ఇస్రో మాజీ చైర్మన్ జి.మాధవన్ నాయర్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులపై గురువారం సీబీఐ చార్జ్‌షీట్ దాఖలు చేసింది. ప్రైవేట్ మల్టీమీడియా కంపెనీ దేవాస్‌కు ఇస్రో వాణిజ్య విభాగం యాంత్రిక్స్ రూ. 578 కోట్ల మేర అక్రమంగా లబ్ధి చే కూర్చినట్లు చార్జ్‌షీట్‌లో పేర్కొంది. నాయర్‌తో పాటు అప్పటి యాంత్రిక్స్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ కె.ఆర్.శ్రీధర్ మూర్తి, దేవాస్ సీఈవో రామచంద్ర విశ్వనాథన్(ఫోర్జ్ అడ్వైజర్స్ మాజీ ఎండీ), దేవాస్ డెరైక్టర్ ఎం.జి.చంద్రశేఖర్‌ల పేర్లను అభియోగ పత్రంలో చేర్చారు.

ఢిల్లీలోని సంబంధిత కోర్టులో సమర్పించిన ఈ చార్జ్‌షీట్‌లో అంతరిక్ష విభాగం అదనపు కార్యదర్శి వీనా ఎస్ రావు, ఇస్రో అప్పటి డెరై క్టర్ ఎ.భాస్కర్ నారాయణరావు, దేవాస్‌కి చెందిన ఇద్దరు డెరైక్టర్లు డి.వేణుగోపాల్, ఎం.ఉమేశ్ పేర్లనూ పేర్కొన్నారు. మోసానికి పాల్పడినందుకు ఐపీసీలోని వివిధ సెక్షన్లతో పాటు, అధికార దుర్వినియోగంతో తమకు, ఇతరులకు అక్రమ లబ్ధి చేకూరేలా వ్యవహరించినందుకు అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద నేరానికి పాల్పడినట్లు ఆరోపించింది. జీశాట్-6, జీశాట్-6ఏ ఉపగ్రహాలు, భారత భూ భాగంలోని వ్యవస్థల ద్వారా ఎస్-బ్యాండ్ సాయంతో మొబైల్ ఫోన్లకు వీడియోలు, మల్టీమీడియా వివరాలు, సమాచార సేవల్ని పంపేందుకు దేవాస్‌ను అనుమతించేలా అధికార దుర్వినియోగం చేశారంది.
 
వివరాల్ని తొక్కిపెట్టారు: ఎస్-బ్యాండ్ తరంగాలు కావాలంటూ రక్షణ, టెలికం శాఖలు కోరాయన్న అంశాలపై విచారణ కొనసాగుతుందని సీబీఐ తెలిపింది. ‘మే, 26 2005న అంతరిక్ష కమిషన్ 104వ సమావేశంలో  జీశాట్-6/ఇన్సాట్-4ఈ కోసం రూ.269 కోట్ల బడ్జెట్ సాయం చేయాల్సిందిగా ఇస్రో కోరింది. అప్పటికే దేవాస్‌తో ఒప్పందం చేసుకున్నా ఆ విషయాన్ని వెల్లడించలేదు. నవంబర్ 17, 2005న జీశాట్-6 నిర్మాణం కోసం కేబినెట్‌కు నోట్ సమర్పించారు. ఒప్పందంపై కేబినెట్‌కు తప్పుడు సమాచారమిచ్చారు.

డిసెంబర్, 2005న కేబినెట్ ఆమోదం తెలిపింది’ అని పేర్కొంది. ఒప్పందాన్ని యాంత్రిక్స్ రద్దు చేసుకోవడంపై అంతర్జాతీయ ట్రిబ్యునల్లో కేసును భారత్ ఓడిపోయిన నెల తర్వాత చార్జ్‌షీట్ దాఖలు చేయడం గమనార్హం. కేసు ఓటమితో పరిహారం కింద దేవాస్ రూ.కోట్లలో పరిహారం చెల్లించాల్సి ఉంటుంది.
 
దేని ఆధారంగా దాఖలు చేశారు?: నాయర్
ఏ ఆధారంగా కేసు దాఖలు చేశారో నిజానికి తనకు అర్థంకావడం లేదని ఇస్రో మాజీ చైర్మన్ మాధవన్ నాయర్ అన్నారు. ‘ఈ అంశంపై ఇంతకుముందు చతుర్వేది, ప్రత్యూష్ సిన్హా కమిటీలు విచారించి.. ప్రభుత్వానికి నష్టం జరగలేదని నిర్ధారణకు వచ్చాయి. అయినా సరే ఆ సమయంలో నలుగురు శాస్త్రవేత్తల్ని శిక్షించారు. నాలుగేళ్ల అనంతరం అదే అంశంపై కోర్టులో కేసు ఎలా దాఖలు చేస్తారో అర్థంకావ డం లేదు’ అని అన్నారు.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)