amp pages | Sakshi

ఇప్పుడు నిఖా హలాల్‌ వంతు

Published on Sat, 06/30/2018 - 12:21

న్యూఢిల్లీ : ముస్లింల వివాదాస్పద విడాకుల చట్టం ‘ట్రిపుల్‌ తలాక్‌’ను చట్టబద్దం కాదని తేల్చిన కేంద్రం ఇప్పుడు ‘నిఖా హలాల్‌, బహుభార్యత్వా’ల చట్టబద్దతలను పరిశీలించనున్నట్లు సమాచారం. ‘నిఖా హలాల్‌, బహుభార్యత్వా’ల ప్రామణికతను సవాలు చేస్తూ గతంలో సుప్రీం కోర్టులో నాలుగు పిటిషన్‌లు దాఖలయ్యాయి. అయితే  ‘ట్రిపుల్‌ తలాక్‌’ అంశంతో పాటే వీటిని కూడా పరిశీలించాల్సిందిగా కేంద్రం, సుప్రీం కోర్టును కోరింది. కానీ సుప్రీం కోర్టు ముందు ట్రిపుల్‌ తలాక్‌ అంశాన్ని విచారించిన  తర్వాత  నిఖా హలాల్‌ అంశాలను చర్చిస్తానని తెలిపింది.

అందులో భాగంగా ప్రస్తుతం ఈ అంశాలను పరిశీలించడానికి  సుప్రీం కోర్టు ఓ ధర్మాసనాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.  ఈ విషయం గురించి ‘నిఖా హలాల్‌, బహుభార్యత్వం అంశాలు లింగ సమానత్వ నియమాలకు వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి సుప్రీం కోర్టు వీటి చట్టబద్దతను విచారించనుంద’ని ఒక సీనియర్‌ న్యాయాధికారి తెలిపారు. గతేడాది ‘ట్రిపుల్‌ తలాక్‌’ అంశం చట్టవిరుద్దమని సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. అనంతరం ‘నిఖా హలాల్‌, బహుభార్యత్వం’ అంశాల గురించి చర్చించేందుకు ఈ ఏడాది మార్చ్‌లో సుప్రీం కోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.

‘కేంద్రం తన మాటకు కట్టుబడి ఉంటుంది. నిఖా హలల, బహుభార్యత్వం వంటి అంశాలకు భారత ప్రభుత్వం ఎప్పుడు వ్యతిరేకమే. ఇప్పుడు సుప్రీం కోర్టులో కూడా ఇదే అంశాన్ని తెలుపుతుంద’ని ఒక సీనియర్‌ న్యాయశాఖ అధికారి తెలిపారు.

నిఖా హలాల్‌...
ఇస్లాం నియమాల ప్రకారం విడాకులు పొందిన స్త్రీ, తిరిగి తన మాజీ భర్తను మళ్లీ వివాహం చేసుకోవాలంటే ముందు ఆమె మరో వ్యక్తిని వివాహం చేసుకోవాలి. తర్వాత ఆ భర్తకు విడాకులైన ఇవ్వాలి, లేదా అతను మరణించేంత వరకూ ఎదురు చూడాలి. ఈ రెండింటిలో ఏదో ఒకటి జరిగితేనే ఆ జంట మళ్లీ కలిసుండటానికి ఇస్లాం ఒప్పుకుంటుంది. 

Videos

Watch Live: మాచర్లలో సీఎం జగన్ ప్రచార సభ

ప్రచారంలో భారతమ్మ..!

బాబే భూబకాసురుడు

కవితకు బిగ్ షాక్...నో బెయిల్

టీడీపీ మేనిఫెస్టోపై సీఎం వైఎస్ జగన్ సెటైర్లు

జగన్ అనే రైతు.. వేసిన విత్తనాలు.. మహా వృక్షాలు అవుతాయి..!

వీళ్ళే మన అభ్యర్థులు గెలిపించాల్సిన బాధ్యత మీదే

నా కుటుంబంలో చిచ్చు పెట్టింది పవన్ నే

రేపల్లె గడ్డ దద్దరిల్లే సీఎం జగన్ గూస్ బంప్స్ స్పీచ్

సీఎం జగన్ రాయల్ ఎంట్రీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)