amp pages | Sakshi

కోటి దాటనున్న కోవిడ్‌-19 టెస్ట్‌లు

Published on Thu, 07/02/2020 - 19:30

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారిని నిరోధించడంలో కీలకమైన కోవిడ్‌-19 పరీక్షలను పెద్దసంఖ్యలో చేపట్టేందుకు చర్యలు చేపడుతున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. త్వరలోనే దేశవ్యాప్తంగా కరోనా పరీక్షల సంఖ్య కోటి దాటనుందని ప్రభుత్వం గురువారం వెల్లడించింది. జులై 2 నాటికి దేశవ్యాప్తంగా పలు ల్యాబ్‌ల్లో మొత్తం 90,56,173 కోవిడ్‌-19 పరీక్షలను నిర్వహించినట్టు ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మొత్తం 1065 టెస్టింగ్‌ ల్యాబ్‌లకు ఐసీఎంఆర్‌ అనుమతి లభించగా వాటిలో 768 ప్రభుత్వ ల్యాబ్‌లు కాగా, 297 ప్రైవేట్‌ ల్యాబ్‌లున్నాయి.

రోజురోజుకూ టెస్టింగ్‌ సామర్థ్యం మెరుగుపడుతుండగా ఈనెల 1న 2,29,598 కోవిడ్‌-19 టెస్టులు నిర్వహించారు. మరోవైపు పరీక్షల వేగం పెంచేందుకు కోవిడ్‌-19 పరీక్షను కేవలం ప్రభుత్వ వైద్యుల ప్రిస్క్రిప‍్షన్‌తోనే కాకుండా ఏ నమోదిత డాక్టర్‌ ప్రిస్క్రిప్షన్‌తో అయినా నిర్వహించే వెసులుబాటును కల్పించినట్టు ప్రభుత్వం పేర్కొంది. ఐసీఎంఆర్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా కోవిడ్‌-19 పరీక్షలను ముమ్మరంగా చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు, కేంద్ర పాలితప్రాంతాలను కోరింది. చదవండి : ‘వారికి కోవిడ్‌-19 ముప్పు అధికం’

Videos

ఫ్రెండ్‌ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్‌ (ఫోటోలు)

రాజధానిపై కూటమి కుట్ర బట్ట బయలు చేసిన దేవులపల్లి

పిఠాపురంలో పవన్ చిత్తు చిత్తు.. ప్రచారంలో వంగా గీత కూతురు అల్లుడు

నా స్కూటీని తగులబెట్టారు: రాగ మంజరి చౌదరి

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కడుపుమంట అదే : నాగార్జున యాదవ్

చంద్రబాబుపై రైతుల ఆగ్రహం

టీడీపీ నేతల రౌడీయిజం.. YSRCP నేతలపై దాడులు

దాడులకు పబ్లిక్ గా బరితెగించిన లోకేష్

అట్టర్ ప్లాప్ .. పవన్ కళ్యాణ్ స్పీచ్ పబ్లిక్ జంప్

బాబు షర్మిల సునీతల అసలు ప్లాన్ ఇదే..!

Photos

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)