amp pages | Sakshi

కామసూత్రలో ‘పౌరసత్వం’

Published on Fri, 01/03/2020 - 16:47

న్యూఢిల్లీ : పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా నేడు దేశవ్యాప్తంగా ప్రజాందోళనలు చెలరేగుతున్న విషయం తెల్సిందే. అసలు పౌరసత్వం అంటే ఏమిటీ? దాన్ని మొదట ఎవరు నిర్వచించారు. దాని నిర్వచనం ఎలా మారుతూ వచ్చింది. ఎక్కడైనా మతాల ప్రాతిపదికన పౌరసత్వం ఇచ్చే చట్టాలున్నాయా?

పౌరసత్వం అనే దృక్పథాన్ని ప్రపంచంలో మొట్టమొదట గ్రీస్‌లో అరిస్టాటిల్‌ తీసుకొచ్చారు. ‘దేశ విధాన చర్చల్లో పాల్గొనే హక్కు లేదా న్యాయ అధికారిగా కొనసాగే హక్కు కలిగి ఉండడాన్ని అరిస్టాటిల్‌ పౌరసత్వం అన్నారు. గ్రహాంతర వాసులకు, బానిసలకు పౌరసత్వ హక్కులు లేవని కూడా స్పష్టం చేశారు. ఆ తర్వాత పౌరసత్వానికి యూరప్‌ మేథావులు కొత్త నిర్వచనాన్ని ఇచ్చారు. ఓటు హక్కు కలిగి ఉండడం. దాని ద్వారా ఎన్నుకున్న ప్రభుత్వం నుంచి ప్రయోజనాలను పొందడం, తద్వారా ఎప్పటికప్పుడు జీవన ప్రమాణాలను మెరగుపర్చుకోవడం. వలసదారులకు జాతి, మత, కుల, రంగు ప్రాతిపదకన కాకుండా సమాజానికి, దేశానికి వారు అందించిన శారీరక శ్రమను దృష్టిలో ఉంచుకొని పౌరసత్వం ఇవ్వొచ్చని కూడా యూరప్‌ మేధావులు సూచించారు.

దురదృష్టవశాత్తు భారతీయ పురాణ ఇతిహాసాల్లోగానీ, కౌటిల్యుడు రాసిన ‘అర్ధశాస్త్రం’లో పౌరసత్వానికి నిర్వచనం సూచించలేదు. వాత్సాయనుడు రాసిన ‘కామసూత్ర’లో మాత్రం నాగరికుడు ఎవరు? పేరిట కొంత నిర్వచనం ఉంది. ‘నాగరికుడంటే దుస్తులు, నగలు ధరించే ఇంటి యజమాని. మధ్యాహ్మం వేళ మిత్రులతో కలిసి పిచ్చాపాటి మాట్లాడం, సాయంత్రం వేళ మిత్రులతో కలిసి పాటలతో కాలక్షేపం చేయడం, రాత్రివేళ అలంకరించిన పడక గదిలోకి వెళ్లి తనకు కేటాయించిన యువతితో శృంగారాన్ని కొనసాగించేవాడు’ అన్న నిర్వచనం మాత్రమే ఉంది. దేశం, దేశంలోపల సభ్యత్వం అన్న అంశాలు లేవు.

అఫ్ఘానిస్థాన్, బంగ్లాదేశ్, పాకిస్థాన్‌ నుంచి వచ్చిన మైనార్టీ శరణార్థులకు పౌరసత్వం ఇచ్చేందుకు కేంద్రం పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకొచ్చిందిగానీ ఆ మూడు దేశాల్లో కూడా మైనారిటీల వ్యతిరేకంగా లేదా మతం ప్రాతిపదికన పౌరసత్వం ఇచ్చే చట్టాలు లేవు. ఇప్పటికే శ్వేత జాతీయులకు అనుకూలంగా వ్యవహరిస్తోన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్, హిందువులకు పౌరసత్వం ఇవ్వమంటూ లేదా హిందువులకు మినహా మిగతా మతాల వారికి పౌరసత్వం కల్పించే ఓ చట్టం తీసుకొస్తే ఎలా ఉంటుందో ‘సీఏఏ’ సమర్థిస్తున్న వాళ్లు ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. (చదవండి: నేను ఈ దేశపు పౌరుడినేనా?)

Videos

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

మన అభ్యర్థులు వీరే..భారీ మెజారిటీతో గెలిపించండి

విలవిల లాడిన వృద్ధులు.. 30 మందికిపైగా మృతి..!

Aditi Rao Hydari: సిద్దార్థ్ తో ఎంగేజ్మెంట్

ఇది క్లాస్ వార్..దద్దరిల్లిన నరసాపురం

ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ 31 మూవీ క్రేజీ అప్డేట్

అవ్వా, తాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్ రియాక్షన్..

నరసాపురం జనసంద్రం

రాష్ట్రంలో ముగ్గురు మూర్ఖులు ఉన్నారు: నాగార్జున యాదవ్

చంద్రబాబుపై ఫైర్

Photos

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)