amp pages | Sakshi

వాద్రా వ్యవహారంపై స్పందించిన కాంగ్రెస్

Published on Sun, 11/02/2014 - 18:48

న్యూఢిల్లీ: ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ అధికారికంగా స్పందించింది. వాద్రా ప్రజాజీవితంలో లేరని, ఆయన ఎలాంటి హోదాలోనూ లేరని కాంగ్రెస్ పేర్కొంది. ప్రైవేట్ కార్యక్రమాల వద్ద వాద్రాను పదేపదే ప్రశ్నించడం సరికాదని వ్యాఖ్యానించింది. మీడియా ఇలాంటి వైఖరి విడనాడాలని సూచించింది.

రాబర్ట్‌ వాద్రా మీడియాపై దురుసుగా ప్రవర్తించడం వివాదాస్పదంగా మారింది.  ఢిల్లీలోని అశోక హోటల్‌లో భూమి లావాదేవీలకు సంబంధించి విలేకరి అడిగిన ప్రశ్నకు సహనం కోల్పోయిన వాద్రా మైకును తోసేశారు. ఆయన సెక్యూరిటీ సిబ్బంది కూడా మీడియా ప్రతినిధుల పట్ల కఠినంగా ప్రవర్తించింది. విలేకరుల పట్ల దురుసుగా ప్రవర్తించినప్పుడు తీసిన వీడియో ఫుటేజ్‌ను వెంటనే తొలగించాలని  వాద్రా తన సెక్యూరిటీ సిబ్బందికి హుకుం జారీ చేశారు. ఈ సంఘటనపై విమర్శలు రావడంతో కాంగ్రెస్ స్పందించింది.

Videos

ఫ్రెండ్‌ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్‌ (ఫోటోలు)

రాజధానిపై కూటమి కుట్ర బట్ట బయలు చేసిన దేవులపల్లి

పిఠాపురంలో పవన్ చిత్తు చిత్తు.. ప్రచారంలో వంగా గీత కూతురు అల్లుడు

నా స్కూటీని తగులబెట్టారు: రాగ మంజరి చౌదరి

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కడుపుమంట అదే : నాగార్జున యాదవ్

చంద్రబాబుపై రైతుల ఆగ్రహం

టీడీపీ నేతల రౌడీయిజం.. YSRCP నేతలపై దాడులు

దాడులకు పబ్లిక్ గా బరితెగించిన లోకేష్

అట్టర్ ప్లాప్ .. పవన్ కళ్యాణ్ స్పీచ్ పబ్లిక్ జంప్

బాబు షర్మిల సునీతల అసలు ప్లాన్ ఇదే..!

Photos

+5

హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)