amp pages | Sakshi

5,274 కేసులు.. 149 మరణాలు

Published on Thu, 04/09/2020 - 04:42

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్‌ విశ్వరూపం ప్రదర్శిస్తోంది. ఈ మహమ్మారి బారినపడి కేవలం కేవలం ఒక్కరోజులో 32 మంది కన్నుమూశారు. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి బుధవారం ఉదయం 9 గంటల వరకు కొత్తగా 485 మందికి కరోనా వైరస్‌ సోకినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం ప్రకటించింది. దేశంలో కరోనా వల్ల ఇప్పటిదాకా 149 మరణాలు సంభవించాయని, మొత్తం పాజిటివ్‌ కేసులు 5,274కు చేరాయని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ మీడియా సమావేశంలో వెల్లడించారు. కేసుల తీవ్రత నానాటికీ పెరుగుతుండడంతో కరోనాను ఎదుర్కొనే విషయంలో కేంద్ర ప్రభుత్వం సైతం అదేస్థాయిలో సన్నద్ధమవుతున్నట్లు తెలిపారు. ఆసుపత్రుల్లో వైద్యులు, నర్సులకు కరోనా సోకకుండా పటిష్టమైన చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.

కరోనా బాధితులను కలిసిన వారందరినీ గుర్తించాలని, తాత్కాలిక ఆసుపత్రుల నిర్మాణంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను ఆదేశించిందన్నారు. దేశంలో హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ ఔషధ నిల్వలు సరిపడా ఉన్నాయని స్పష్టం చేశారు. కరోనాపై విజయం సాధించాలంటే ప్రజల సహకారం తప్పనిసరి అని చెప్పారు.  ఇప్పటిదాకా 1,21,271 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్‌)లో ఎడిడెమోలజీ విభాగం అధిపతి రామన్‌ ఆర్‌ గంగాఖేడ్కర్‌ చెప్పారు. ఇందులో 13,345 పరీక్షలు మంగళవారం నిర్వహించామన్నారు. ప్రస్తుతం ఐసీఎంఆర్‌ ఆధ్వర్యంలో 139 ల్యాబ్‌లు పని చేస్తున్నాయని అన్నారు. అలాగే 65 ప్రైవేట్‌ ల్యాబ్‌లకు అనుమతి ఇచ్చామని వెల్లడించారు.

కరోనా కట్టడికి కొత్త ఉద్యోగులు
దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. కరోనాపై పోరాటంలో భాగంగా వైద్యులు, నర్సులు, పారిశుధ్య సిబ్బంది, స్వచ్ఛంద సేవకులు, పోలీసులు నిర్విరామంగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికి కొంత విశ్రాంతి కల్పిస్తూ వారి స్థానంలో భారీ స్థాయిలో కొత్త ఉద్యోగులను నియమించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా బాధితులకు వైద్య సేవలందించేందుకు, వైరస్‌ నియంత్రణ చర్యలు అమలు చేసేందుకు ఈ కొత్త ఉద్యోగులను నియమిస్తారు. ఈ ఉద్యోగులకు అవసరమైన శిక్షణను ఆన్‌లైన్‌ ద్వారా ఇస్తారు. ఇందుకోసం ఇంటిగ్రేటెడ్‌ గవర్నమెంట్‌ ఆన్‌లైన్‌ ట్రైనింగ్‌(ఐజీవోటీ) అనే వేదికను సిద్ధం చేశారు. డాక్టర్లు, నర్సులు, పారామెడికల్‌ సిబ్బంది, పారిశుధ్య సిబ్బంది, సాంకేతిక నిపుణులు, ఏఎన్‌ఎంలు, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు, పౌర రక్షణ సిబ్బందికి ఈ ఆన్‌లైన్‌ శిక్షణ ఉంటుంది.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)