amp pages | Sakshi

స్మృతి ఇరానీ మెడకు 'విద్యార్హత' ఉచ్చు

Published on Thu, 06/25/2015 - 03:02

విద్యార్హతలపై ఈసీకి తప్పుడు సమాచారం ఇచ్చారని కోర్టులో ఫిర్యాదు
న్యూఢిల్లీ: కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీకి తాజా మరో చిక్కు! ఆమె విద్యార్హతలకు సంబంధించి ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చారంటూ దాఖలైన ఓ ఫిర్యాదును ఢిల్లీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు బుధవారం పరిశీలనకు స్వీకరించింది. ఆమేర్ ఖాన్ అనే ఫ్రీలాన్స్ రచయిత ఈ ఫిర్యాదును దాఖలు చేశారు. లోక్‌సభ, రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి కేంద్ర మంత్రి ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన మూడు అఫిడవిట్లలో తన విద్యార్హతలను ఒక్కోదాంట్లో ఒకో విధంగా ఇచ్చారని ఆమేర్ పేర్కొన్నారు.

మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఆకాశ్ జైన్ తదుపరి విచారణను ఆగస్టు 28కి వాయిదా వేశారు. ఆరోజు ఫిర్యాదుదారు నుంచి కోర్టు వాంగ్మూలాన్ని స్వీకరించడంతోపాటు ప్రాథమిక ఆధారాలను సమర్పించడానికి అవకాశమిస్తుంది. 2004, 2011, 2014లలో ఈసీకి ఇచ్చిన అఫిడవిట్లలో కేంద్ర మంత్రి తన విద్యార్హతలపై తప్పుడు సమాచారం ఇచ్చారని ఆమేర్ పేర్కొన్నారు.  
 
‘మంత్రిని తొలగించాలి..’
కోర్టులో ఈ ఫిర్యాదు దాఖలవడంతో ఇరానీ తీవ్ర ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 125 ఏ ప్రకారం తప్పుడు అఫిడవిట్ ఇచ్చినట్లు రుజువైతే ఆరు నెలల జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ కలిపి విధించడానికి అవకాశం ఉంటుంది. మంత్రికి వ్యతిరేకంగా దాఖలైన ఫిర్యాదును ఢిల్లీకోర్టు పరిశీలనకు స్వీకరించడంతో కాంగ్రెస్, ఆప్‌లు.. ఇరానీపై పెద్ద ఎత్తున విమర్శలకు దిగాయి. ఆమె మంత్రి పదవిలో కొనసాగడానికి ఎలాంటి నైతిక హక్కు లేదని, చట్టపరంగా, రాజ్యాంగపరంగా ఆమె మంత్రి పదవిలో కొనసాగడానికి వీలు లేదని ధ్వజమెత్తాయి. ఆమెను వెంటనే పదవినుంచి తొలగించాలని డిమాండ్ చేశాయి.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌