amp pages | Sakshi

క్యాష్‌ కోసం వెళ్తే.. మా పని ఎవరు చేస్తారు?

Published on Wed, 11/16/2016 - 08:51

గువాహతి: పెద్ద నోట్ల రద్దుతో సామాన్య ప్రజల కష్టాలు రెట్టింపవుతున్నాయి. ఉద్యోగం, వారు చేసే వ్యాపారాలు, ఇతర పనులు వదిలేసి మరీ బ్యాంకులు, ఏటీఎం కేంద్రాలకు పరుగులు పెడుతున్నా నగదు చేతికి అందక కొన్ని సందర్భాలలో నిరాశ తప్పడం లేదు. చేతిలో డబ్బులు అందుబాటులో లేకపోతే తమ పరిస్థితి ఎలా ఉంటుందో అసోం రైతులు చెబుతున్నారు. రబీ సీజన్‌లో పంట అవసరాలకు ఖర్చులకు, విత్తనాల కొనుగోలుకు డబ్బులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అపూర్వ అనే రైతు జాతీయ మీడియాకు తెలిపారు. సీజన్ సమయంలో డబ్బుల కోసం పొలాన్ని వదిలి వెళ్లడం రైతులకు ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు.

'రోజుకు రెండు వేల రూపాయలు మాత్రమే ఏటీఎంలలో డ్రా చేసుకునే వీలు దొరుకుతోంది. కానీ తమ అవసరాలకు కనీసం 5వేల రూపాయలు చేతిలో ఉండాలి. సీజన్ ఇప్పటికే వచ్చేసింది. అయినా విత్తనాలు కొనేందుకు మా వద్ద డబ్బులు లేవు' ఏం చేయాలో అర్ధంకావడం లేదని సోనాపూర్ గ్రామ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పొలం సాగు పనులను వదిలేసి బ్యాంకుల వద్దే సుదీర్ఘంగా ఉండాల్సి రావడం ఏమాత్రం శుభపరిణామం కాదని అపూర్వ అభిప్రాయపడ్డారు. తమ సమస్యలు అర్థం చేసుకుని కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అసోం రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Videos

ఫ్రెండ్‌ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్‌ (ఫోటోలు)

రాజధానిపై కూటమి కుట్ర బట్ట బయలు చేసిన దేవులపల్లి

పిఠాపురంలో పవన్ చిత్తు చిత్తు.. ప్రచారంలో వంగా గీత కూతురు అల్లుడు

నా స్కూటీని తగులబెట్టారు: రాగ మంజరి చౌదరి

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కడుపుమంట అదే : నాగార్జున యాదవ్

చంద్రబాబుపై రైతుల ఆగ్రహం

టీడీపీ నేతల రౌడీయిజం.. YSRCP నేతలపై దాడులు

దాడులకు పబ్లిక్ గా బరితెగించిన లోకేష్

అట్టర్ ప్లాప్ .. పవన్ కళ్యాణ్ స్పీచ్ పబ్లిక్ జంప్

బాబు షర్మిల సునీతల అసలు ప్లాన్ ఇదే..!

Photos

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)