amp pages | Sakshi

‘ఎన్నికలు ఎలా నిర్వహించాలో మాకే చెప్తారా’

Published on Tue, 09/18/2018 - 20:28

సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ పార్టీపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రం అసహనం వ్యక్తం చేసింది. కాంగ్రెస్‌ నేతలు పదే పదే తమ పనిలో జోక్యం చేసుకుంటురని, ఎన్నికలు ఎలా నిర్వహించాలో తమకు తెలుసని సీఈసీ వ్యాఖ్యానించింది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న రాజస్తాన్‌, మధ్యప్రదేశ్‌లో ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయని.. ఎన్నికలను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని కోరుతూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కమల్‌నాథ్‌ సుప్రీంకోర్టులో ఇటీవల పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారించిన సుప్రీం ధర్మాసనం వెంటనే కౌంటర్‌ దాఖలు చేయాల్సిందిగా ఈసీని అదేశించింది.

మంగళవారం దీనిపై అఫడవిట్ దాఖలు చేసిన ఈసీ.. కాంగ్రెస్‌ నేతల తీరుపై అసహనం వ్యక్తం చేసింది. ఓటర్ల జాబితాలో్ అక్రమాలు చోటుచేసుకున్నట్లు వారి వద్ద ఎలాంటి ఆధారాలు లేవని.. తమ విధులను తప్పుపడుతూ కాంగ్రెస్‌ నేతలు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేయాలని సుప్రీంను కోరింది. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థను ఎన్నికలు పారదర్శకంగా వ్యవహరించాలని ఎలా కోరతారని ఈసీ ప్రశ్నించింది. కాగా మధ్యప్రదేశ్‌లో 60 లక్షలకు పైగా  బోగస్‌ ఓట్లు ఉన్నాయని పిటిషన్‌ తరుఫున న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీ ధర్మాసనానికి వెల్లడించారు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌