amp pages | Sakshi

గవర్నర్‌ సిఫారసుపై భిన్నస్వరాలు 

Published on Wed, 11/13/2019 - 03:06

ముంబై: మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన కోసం గవర్నర్‌ బీకే కోష్యారీ చేసిన సిఫారసుకు గల రాజ్యాంగ బద్ధతపై నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. గవర్నర్‌ సిఫారసు రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయమని రాజ్యాంగ నిపుణుడు ఉల్లాస్‌ బాపట్‌ అన్నారు. ‘ప్రభుత్వ ఏర్పాటుపై సానుకూలంగా స్పందించాలంటూ బీజేపీకి రెండు రోజులు గడువిచి్చన గవర్నర్‌.. ఇతర పార్టీలకు 24 గంటలు మాత్రమే సమయమివ్వడం, కాంగ్రెస్‌ను పట్టించుకోకపోవడం పక్షపాత ధోరణిగా కనిపిస్తోంది’అని అన్నారు.

అత్యవసరం అయినప్పుడు ఒక ఔషధంగా మాత్రమే రాష్ట్రపతి పాలన అ్రస్తాన్ని వాడాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర మాజీ అడ్వకేట్‌ జనరల్, సీనియర్‌ లాయర్‌ శ్రీహరి ఆనె∙మాట్లాడుతూ.. ఏ పార్టీ కూడా సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేయలేదని గవర్నర్‌ సకారణంగా భావించినప్పుడు రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేయవచ్చు. ఎన్నికల ఫలితాలు వెలువడిన అక్టోబర్‌ 24 నాటి నుంచి ప్రభుత్వం ఏర్పాటు కోసం ప్రయత్నాలు చేసుకునేందుకు అన్ని పక్షాలకు తగిన సమయం ఉంది. గవర్నర్‌ పిలిచే దాకా వారు ఆ ప్రయత్నాలు చేయలేదనడం అర్థరహితం. ప్రభుత్వం ఏర్పాటుపై సంసిద్ధత తెలిపేందుకు ప్రతి పార్టీకి ఇచ్చే గడువు పై నిర్దిష్టత అంటూ ఏమీ లేదు’ అని తెలిపారు.

ముచ్చటగా మూడోసారి... 
మహారాష్ట్రలో ఇప్పటిదాకా రెండుసార్లు రాష్ట్రపతి పాలన విధించారు. 1980, ఫిబ్రవరి 17న మొదటిసారి మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించారు. 1980లో శరద్‌పవార్‌కి మెజారిటీ ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దుచేసి, రాష్ట్రపతి పాలన విధించారు. ఫిబ్రవరి 17, 1980 నుంచి, 1980 జూన్‌ 8 వరకు అంటే 112 రోజుల పాటు అది కొనసాగింది. 2014లో సైతం మరోమారు మహారాష్ట్ర రాష్ట్రపతి పాలనను చవిచూడాల్సి వచ్చింది. సెపె్టంబర్‌ 28, 2014 నుంచి అక్టోబర్‌ 31, 2014 వరకు రాష్ట్రపతి పాలన విధించారు. అప్పుడు మొత్తం 33 రోజుల పాటు రాష్ట్రపతి పాలన అమలులో ఉంది.   

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌