amp pages | Sakshi

రైతులు సెలవు పెట్టారు...

Published on Thu, 04/12/2018 - 22:23

కర్షకుడికి కడుపు మండి కన్నెర్ర చేస్తున్నాడు. తాను చేస్తున్న పని నుంచి ‘సెలవు’ (లీవ్‌) తీసుకోవడంతో పాటు మార్కెట్‌ను బహిష్కరించాలని నిర్ణయించారు. అంతే కాదు వచ్చే జూన్‌నెలలో పదిరోజుల పాటు ఆహారధాన్యాలు, కూరగాయలు, పాల వంటి నిత్యావసరాలను వినియోగదారులకు అమ్మకూడదని తీర్మానించారు.

ఎందుకు ?
రుణమాఫీతో పాటు స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులు అమలు చేయాలంటూ దేశవ్యాప్తంగా రైతులు రొడ్డెక్కుతున్నారు. ఈ డిమాండ్లపై  గత నెల 23న దేశరాజధాని ఢిల్లీలో భారీ ప్రదర్శన నిర్వహించాలనే రైతుసంఘాల ప్రయత్నం ఫలించలేదు. ఈ నేపథ్యంలో మళ్లీ కొత్త ఉద్యమాన్ని చేపట్టడంలో భాగంగా  జూన్‌ 1 నుంచి మార్కెట్లలో పాలతో సహా కూరగాయలు, ఆహారధాన్యాలేవీ అమ్మకూడదని నిర్ణయించారు.   దేశవ్యాప్తంగా రైతుసంఘాలు ఈ మేరకు  ఆందోళనలు నిర్వహించనున్నాయి. వివిధ రాష్ట్రాల్లోని రైతుసంఘాలకు భిన్నంగా  హరియాణా రైతులు  రాష్ట్రీయ కిసాన్‌ మహాసంఘ్‌ నాయకత్వంలో  ‘సెలవుపై రైతులు’ (కిసాన్‌ అవ్‌కాశ్‌) చేపట్టాలని నిర్ణయించారు. ఈ  నిరసనల్లో భాగంగా తమ తమ గ్రామాల్లో ధర్నాలు చేపట్టడంతో పాటు మార్కెట్‌లో ఏ వస్తువు కూడా అమ్మకూడదని, ఏదీ కొనకూడదనే నిర్ణయానికి వచ్చారు.

ఏకగ్రీవ నిర్ణయం...
రైతుసంఘాల భేటీలో ‘కిసాన్‌ అవ్‌కాశ్‌’పై  ఏకగ్రీవ నిర్ణయాన్ని తీసుకున్నారు. కనీసం పదిరోజుల పాటు నిరసనలు కొనసాగించి, పొడిగింపుపై నిర్ణయిస్తారు.. మహాసంఘ్‌లోని  ఏడు రైతు సంఘాల్లోని సభ్యులతో పాటు ఇతర రైతులు ఈ ఆందోళనల్లో పాల్గొంటారు. శాంతియుత పద్ధతుల్లో నిరసనల ద్వారా  తమ ఐకమత్యాన్ని నిరూపించాలని భావిస్తున్నారు.
 

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)